వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

68 మంది జడ్జీలు: కొలిజీయం సిఫారసుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం...?

|
Google Oneindia TeluguNews

దేశంలో 68 మంది జడ్జీల పేర్లతో సుప్రీంకోర్టు కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 68 మందిలో న్యాయాధికారులు, అడ్వకేట్లు, జడ్జీలు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 8వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొలిజీయం వివిధ రాష్ట్రాల్లో గల 100 మంది పేర్లను పరిశీలించింది. అందులో 68 మందిని ఎంపిక చేసి.. 12 రాష్ట్రాలకు జడ్జీలుగా నియమించాలని కోరింది.

సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో కొలిజీయం ఈ మేరకు సిఫారసు చేసింది. 68 మందిలో కర్ణాటక నుంచి ఇద్దరు, జమ్ముకశ్మీర్ నుంచి ఒకరిని మూడోసారి కొలిజీయం సిఫారసు చేసింది. 10 మంది జడ్జీలను కొలిజీయం రెండోసారి సిఫారసు చేసింది. మిగతా వారు మాత్రం ఫస్ట్ టైమ్ సిఫారసు చేసింది. ఆగస్ట్ 17వ తేదీన 9 మంది జడ్జీలలో ముగ్గురు మహిళలు ఉన్నారు. శుక్రవారం కొలిజీయం 8 మంది జడ్జీలను సిఫారసు చేసింది. వారిలో కోలకతా తాత్కాలిక చీఫ్ జస్టిస్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఉన్నారు. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిల్ కురేషి.. 28 మంది జడ్జీలను ట్రాన్స్ ఫర్ చేయాలని కోరింది. దేశంలో 25 హైకోర్టులో 1098 మంది జడ్జీలు ఉన్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ వరకు 465 ఖాళీలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది.

 Govt yet to take call on 68 names sent by SC collegium for appointment as HC judges

ఇదివరకు సిఫారసు చేసిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. అలహబాద్ హైకోర్టుకు 13 మంది లాయర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.. అలహబాద్ హైకోర్టులో ప్రస్తుతం 92 మంది న్యాయమూర్తులు ఉన్నారు.. అలహబాద్ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 160 కాగా.. భర్తీ చేయాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 68గా ఉంది.. ఇక, కేరళ హైకోర్టుకు 8 మంది న్యాయమూర్తులను నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.. అందులో నలుగురు లాయర్లు. మరో నలుగురు న్యాయాధికారులు ఉన్నారు.

జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది కొలీజియం. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 1 లాయర్ ను న్యాయమూర్తిగా నియామకం చేస్తూ సిఫార్సులు ఇచ్చింది. పంజాబ్ హైకోర్టుకు నలుగురు లాయర్లను న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. రాజస్థాన్ హైకోర్టుకు ముగ్గురు లాయర్లను, మరో ముగ్గురు జ్యుడిషియల్ అధికారులు కలిపి మొత్తం ఆరుగురు న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. గౌహతి హైకోర్టు కు ముగ్గురు లాయర్లను, మరో ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను కలిపి ఐదుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Recommended Video

Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections || Oneindia Telugu

బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు రాజీనామాను ధృవీకరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛత్తీస్‌ఘడ్ హైకోర్టుకు ఒక లాయర్‌ను, ఒక జ్యుడిషియల్ అధికారిని మొత్తం ఇద్దరిని న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను మరో ఇద్దరు లాయర్లు.. మొత్తం నలుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

English summary
central government is yet to take a call on the recommendations made by the Supreme Court collegium on appointing a total of 68 judicial officers and advocates as judges of various high courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X