వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లలో జీపీఎస్! ఇక 700 రైళ్లకుపైగా రియల్ టైమ్ మానిటరింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రూపొందించిన ది కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్(సీఓఏ) 700కుపైగా రైళ్ల రియల్ టైమ్‌ను మానిటరింగ్ చేయడం ప్రారంభించింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను ఇందులో ఫిట్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైలు ట్రాక్ కదలికలను తెలుసుకోవచ్చు.

వారు మాత్రమే చెప్పగలరు ఆకాశానికి హద్దు ఉంటుందని: ఫిట్ ఇండియా కార్యక్రమంలో మోడీ

రైలు, అందులో ప్రయాణించే ప్రయాణికుల కదలికలను తెలుసుకునేందుకు భారత రైల్వే.. ఇస్రోతో కలిసి సీఓఏ సిస్టమ్‌ను రూపొందించాయి. ఈ సిస్టమ్ ద్వారా రైలు, అందులో ప్రయాణించే ప్రయాణికుల కదలికల సమాచారం నేరుగా కంట్రోల్ రూంకు చేరిపోతుంది.

GPS in trains! Real-time monitoring of over 700 trains begins

ప్యాసింజిర్ ట్రైన్ల రియల్ టైమ్‌ను గురించి తెలుసుకోవడానికే కాకుండా బొగ్గు, ఆయిల్, ఇతర సరుకుల దొంగతనం వంటి వాటిని కూడా అరికట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీల్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ల మధ్యలో గూడ్స్ రైళ్లను నిలిపివేయడం ఇప్పుడు సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా గూడ్స్ రైళ్లలో సరుకును దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే.. వారు వెంటనే దొరికిపోతారని చెప్పారు.

భారత రైల్వేలు గూడ్స్ రవాణా ద్వారా భారీ మొత్తాన్ని అందుకుంటున్నాయి. వరుస దొంగతనాలు జరుగుతుండటం కూడా ఈ సిస్థమ్ అవసరమవుతోంది. రైల్వే మోడర్నైస్ కంట్రోల్ రూం, రైల్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ వ్యాప్తంగా ట్రైన్ మూవ్‌మెంట్ తెలుసుకునేందుకు ఈ కొత్త సిస్టమ్ తోడ్పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

English summary
The Control Office Application (COA) system designed by Indian Space Research Organisation (ISRO) has begun real-time monitoring of over 700 trains, fitted with GPS (Global Positioning System). The system will help track movement of trains even between two stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X