వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమర సన్నాహాలు: మోదీకి దీటుగా ‘మహా’ కూటమి ఖాయమేనా? వేచి చూద్దామన్న ఎస్పీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

అతి విశ్వాసం వల్లనే బీజేపీ ఓటమి : మోదీకి దీటుగా ‘మహా’కూటమి సన్నాహాలు

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి బుధవారం ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన మూడు జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల విజయం నేపథ్యంగా మారింది.
ఆ దిశగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సమాజ్‌వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

విపక్షాల్లో నైతిక స్థైర్యాన్ని నింపిన యూపీ, బీహార్ ఉప ఎన్నికలు

విపక్షాల్లో నైతిక స్థైర్యాన్ని నింపిన యూపీ, బీహార్ ఉప ఎన్నికలు

జాతీయ స్థాయిలో మహా కూటమి ఆశలకనుగుణంగానే యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు విపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు.

పవార్‌తోనూ మంతనాలు జరిపిన రాహుల్ గాంధీ

పవార్‌తోనూ మంతనాలు జరిపిన రాహుల్ గాంధీ

మహాకూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ వెల్లడించారు. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శరద్‌పవార్‌తో మాట్లాడారు.

మహా కూటమి వాస్తవ రూపం దాలుస్తుందన్న ఫరూఖ్ అబ్దుల్లా

మహా కూటమి వాస్తవ రూపం దాలుస్తుందన్న ఫరూఖ్ అబ్దుల్లా

ఈ నెల 28న రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. మహాకూటమి వాస్తవ రూపం దాల్చుతున్నది అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయాలు సాధించడాన్ని ఆయన గుర్తుచేశారు.

విపక్షాల కూటమి చర్చల కోసమే సోనియా విందు సమావేశం

విపక్షాల కూటమి చర్చల కోసమే సోనియా విందు సమావేశం

మహాకూటమి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడుతాయో యూపీలో స్పష్టమైందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇటీవల ఢిల్లీలో ఇచ్చిన విందుకు ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు కోసమే ఆ విందు నిర్వహించినట్టు తెలుస్తున్నది.

వేచి చూడాలన్న ఎస్పీ నేత రాం గోపాల్ యాదవ్

వేచి చూడాలన్న ఎస్పీ నేత రాం గోపాల్ యాదవ్

యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు భావసారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యేలా ప్రభావం చూపుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా అన్నారు. అయితే మహాకూటమిపై సాగుతున్న చర్చల గురించి సమాజ్‌వాదీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ మాత్రం వేచి చూడండి అని అన్నారు. ఈ ఫలితాలపై తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని, వారు సంతృప్తి పడితే మరిన్ని ఓట్లు పడుతాయని చెప్పారు.

కాన్షీరాం గొప్ప సంఘ సంస్కర్త అని రాహుల్ నివాళులు

కాన్షీరాం గొప్ప సంఘ సంస్కర్త అని రాహుల్ నివాళులు

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా రాహుల్‌గాంధీ గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాన్షీరాం గొప్ప సామాజిక సంస్కర్త అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండటం, యూపీలో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన స్నేహ హస్తం అందించేవిగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పోటీలపై పవార్‌తో రాహుల్ చర్చలు

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పోటీలపై పవార్‌తో రాహుల్ చర్చలు

మరోవైపు రాహుల్‌గాంధీ బుధవారం రాత్రి ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా గట్టిపోటీనివ్వాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న శరద్‌పవార్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

బీఎస్పీతో సానుకూల సంబంధాలు ఉన్నాయన్న అఖిలేశ్

బీఎస్పీతో సానుకూల సంబంధాలు ఉన్నాయన్న అఖిలేశ్

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతుతో రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఇక ముందు కూడా ఆ పొత్తును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతాన్ని మరచిపోవాలని, బీఎస్పీతో తమ సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నది. బద్దవిరోధులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి. గోరఖ్‌పూర్ సీటును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫూల్పూర్ నియోజకవర్గాన్ని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేయడంతో ఆ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

యూపీలో బలోపేతం దిశగా ఎస్పీ - బీఎస్పీ

యూపీలో బలోపేతం దిశగా ఎస్పీ - బీఎస్పీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రెండు పార్టీల కార్యకర్తలు మాయావతి, అఖిలేశ్‌ను ఉద్దేశించి బువా భతీజా (మేనత్త, మేనల్లుడు) జిందాబాద్ అని నినాదాలు చేయడం రానున్న రోజుల్లో ఎస్పీ, బీఎస్పీల స్నేహం మరింత బలపడనుందనడానికి సంకేతమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని గ్రహించిన అఖిలేశ్ యాదవ్ ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం సాయంత్రం స్వయంగా మాయావతి ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌తో తమ సంబంధాలు ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నాయని అఖిలేశ్ పేర్కొన్నారు. రాహుల్, తాను యువకులమని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు తామిద్దరం కలిసి పరిష్కారాలు వెతుకాల్సి ఉంటుందని చెప్పారు.

అహంకారం ఎవరికి ఉన్నా నష్టమేనని శత్రఘ్న ట్వీట్

అహంకారం ఎవరికి ఉన్నా నష్టమేనని శత్రఘ్న ట్వీట్

యూపీ, బీహార్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. అహంకారం, అసహనం, అతి విశ్వాసం వల్లనే బీజేపీ ఓటమిపాలైందని ఆయన పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. అహంకారం, అసహనం, అతి విశ్వాసం ప్రజాస్వామిక రాజకీయాలను ఖూనీ చేస్తాయని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను. అవి ట్రంప్‌లో ఉన్నా లేక మిత్రపక్షాలు లేదా ప్రతిపక్ష పార్టీలలో ఉన్నా నష్టమే అంటూ శత్రుఘ్న ట్వీట్ చేశారు.

English summary
A day after the Samajwadi Party clinched big wins in Lok Sabha bypolls in Uttar Pradesh, talks of forging a grand alliance ahead of the 2019 elections have picked up steam. Nationalist Congress Party (NCP) MP Majeed Memom said that the wins in Uttar Pradesh and Bihar have given boost to the efforts of forging a grand alliance by the Opposition. "Sonia Gandhi and Sharad Pawar are working together to forge a grand alliance," the NCP leader said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X