వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఉద్యోగులకు జీతాల్లేవ్... ఓ వైపు నాయకత్వం, మరోవైపు ఆర్ధిక సంక్షోభం...!

|
Google Oneindia TeluguNews

జాతీయ కాంగ్రెస్ పార్టీని నాయకత్వ సంక్షోభమే కాకుండా ఆర్ధిక సంక్షోభం కూడ వెంటాడుతోంది. ఇటివల జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రాహుల్ గాంధీ రాజీనామ చేసిన అనంతరం ఆపార్టీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే...తాజాగా పార్టీని నడిపేందుకు ఆర్ధిక వనరులు కూడ లేక పార్టీ అనుబంధ సంఘాల నిధులకు చెక్‌‌ పెట్టడడంతో ఎన్నికల ముందు పని చేసిన పలువురు ఉద్యోగులను కూడ కోత విధించింది.

దేశంలో వరుసగా రెండవసారి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోంటుంది. పార్టీ అనుబంధ సంఘాలతోపాటు గౌరవ వేతనంపై పని చేసే పలువురు సేవదల్ కార్యకర్తలను కూడ ఆర్ధికంగా ఆదుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనుబంధ సంఘాలకు ఇస్తున్న బెడ్జెట్‌లో కొత పెట్టడడంతోపాటు మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ, రైతు సంఘాలకు ఇస్తున్న బడ్జెట్‌ను కూడా తగ్గించారు. ఇక ఆయా సంఘాల్లో పనిచేసే వారిలో అనేక మంది జీతాల్లో కూడ కోత విధించారు.

Grand Old Congress Party is now struggling financial crunch

ఇక తాత్కలిక ప్రతిపాదికన నియమించుకున్న పలువురు ఉద్యోగులను కూడ తొలగించడంతో పాటు గత రెండు నెలలుగా వారికి జీతాలుకూడ చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఉద్యోగులు కూడ వెళ్లిపోయినట్టు సమాచారం.మరోవైపు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు ,అనవసర ప్రయాణాలు కూడ చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.మరోవైపు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో కూడ పనిచేస్తున్న వారికి సరైన సమయంలో జీతాలు లేని పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

English summary
The 2019 Lok Sabha elections saw the Congress party losing its political capital substantially. Already in a pinch on the electoral front, the Grand Old Party is now reportedly struggling on the financial front too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X