చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. ఎయిర్ చైనాకు చెందిన ప్రత్యేక విమానంలో ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సంప్రదాయబద్ధమైన ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అతి కొద్దిమంది అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సంస్కృతి ప్రదర్శనలను తిలకిస్తూ ముందుకు సాగారు. తమిళనాడు సంప్రదాయబద్ధమైన కళలను ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రదర్శించారు. విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద అందుబాటులో ఉంచిన కారులో జిన్ పింగ్ గిండీ రోడ్డులోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ వెళ్లారు.

Grand Welcome For Xi At Chennai Airport Ahead Of Meet With PM

ఈ సాయంత్రం 4: 10 నిమిషాలకు జిన్ పింగ్ మామళ్లాపురానికి బయలుదేరి వెళ్తారు. చెన్నై నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర ప్రాంత పట్టణంలోనే నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల సమయంలో మామళ్లాపురంలో ప్రధానమంత్రి స్వాగతం పలుకుతారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే గడుపుతారు. ఈ సందర్భంగా మామళ్లాపురం ఆలయాన్ని సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. రాత్రి 8: 10 నిమిషాలకు జిన్ పింగ్ చెన్నై గ్రాండ్ చోళ హోటల్ కు చేరుకుంటారు. మోడీ మామళ్లాపురంలోని ఓ రిసార్టులో బస చేస్తారు.

English summary
Chinese President Xi Jinping arrived in India this afternoon for his second informal meeting with Prime Minister Narendra Modi since they met in China's Wuhan in April last year. PM Modi had then invited President Xi to India for a reprise. The two leaders have a packed schedule that includes a tour of the temples of Mahabalipuram, now known as Mamallapuram, informal and delegation-level talks and lunch and dinner meets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X