వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్నటి వరకూ విమానాలకు కరోనా దెబ్బ.!ఇప్పుడు మిడతల వంతు.!వణికిపోతున్న పైలెట్స్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కంటికి కనిపించని కరోనా వైరస్ మొన్నటి వరకూ కరతాళ నృత్యం చేసింది. కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రపంచ దేశాలు షట్ డౌన్ ఐన పరిస్తితులు తలెత్తాయి. అత్యవసర సేవలు మినహా మొత్తం వ్యవస్ధలు మూతపడ్డాయి. కంటికి కనిపించని వైరస్ సృష్టిస్తున్న మారణహోమం ముందు తలవంచుకుని నిలబడ్డాం తప్ప ఎదురుతిరిగే సాహసం మాత్రం చేయలేదు. ఇప్పుడే విధ్వంసం మిడతల రూపంలో పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మిడతల దండు వల్ల గాల్లో ఎగిరే విమానాలకు పైతం ముప్పు పొంచి ఉందని, అందుకు విమాన సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Recommended Video

Locusts A Threat To Flights Whe Landing Or Taking Off Says DGCA
వ్యవసాయ పంటలకే కాదు.. విమానాలకు సైతం మిడతలతో ముప్పే..

వ్యవసాయ పంటలకే కాదు.. విమానాలకు సైతం మిడతలతో ముప్పే..

దేశంలో కరోనా ప్రభావం తగ్గిందో పెరిగిందో అర్ధంకాని తరుణంలో మరో ఉపద్రవం దూసుకొస్తోంది. మిడతల దండు పంటపొలాల మీద దండెత్తడాకి రావడమే కాకుండా మానవాళికి కూడా ప్రమాదంగా మారే అవకాశాలను సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది. దేశానికి పొంచి వున్న మిడతల దాడి కేవలం వ్యవసాయానికే చేటు అనుకుంటే పెద్ద పొరపాటు చేసినట్టే. పంటపోలాలను నిట్ట నిలువునా నాశనం చేసి మానవులకు తిండి గింజల కొరతకు ప్రాధాన కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు నిర్ధారిస్తున్నారు. అంతే కాకుండా విమానాలు గాల్లో ఎగిరేప్పుడు, దిగేప్పుడు సమస్యగా పరిణమించే అవకాశాలు ఉన్నయని విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

మిడతల దండు దూకుడుగా వస్తే విమానాలకు ప్రమాదమే.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సివిల్ ఏవియేషన్

మిడతల దండు దూకుడుగా వస్తే విమానాలకు ప్రమాదమే.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సివిల్ ఏవియేషన్

మిడతల దండు దూకుడుగా వస్తే విమానాలకు ప్రమాదమేనని చెబుతోంది సివిల్ ఏవియేషన్ విభాగం. అలా చెప్పడమే కాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలను కూడా నిర్దేశిస్తోంది. ఏకంగా మిడతల నుంచి విమానాలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సౌతాఫ్రికా నుంచి బయలుదేరి, పాకిస్తాన్ మీదుగా ఇండియాకు చేరాయని భావిస్తున్న మిడతలపై దేశంలోని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. చేతికి అందొచ్చిన పంటలను మిడతల దండు సర్వనాశనం చేస్తుందన్నది వారి వాదన. అయితే మిడతల నివారణకు తగిన చర్యలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

దేశానికి పొంచి వున్న మిడతల ప్రమాదం.. మిడతలను తరిమికొట్టొచ్చంటున్న అధికారులు..

దేశానికి పొంచి వున్న మిడతల ప్రమాదం.. మిడతలను తరిమికొట్టొచ్చంటున్న అధికారులు..

అత్యంత అధునాతన సాంకేతికతతో పాటు హెలికాప్టర్ల ద్వారా మిడతల గమనాన్ని అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అదికారులు. ఈ నేపథ్యంలో మిడతల దండు మీద పడితే పంటలకే కాదు విమానాలకు కూడా లేనిపోని సమస్యలు తలత్తే అవకావాలు ఉన్నాయని పేర్కొంటూ కొన్న ముందస్తు జాగ్రత్తలను కేంద్ర విమానయాన సంస్థ విడుదల చేసింది. విమానాలు దిగుతున్నప్పుడు గానీ, గాల్లోకి ఎగురుతున్నప్పుడు గానీ, మిడతల దండు ఎదురైతే విమానాలకు ముప్పు వాటిల్లుతుందని విమానయాన శాఖ చెబుతోంది.

మిడతల గమనాన్ని గుర్తించాలి.. పైలట్లకు మార్గదర్శకాలు విడుదల..

మిడతల గమనాన్ని గుర్తించాలి.. పైలట్లకు మార్గదర్శకాలు విడుదల..

విమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ శుక్రవారం సాయంత్రం కొన్ని మార్గదర్వకాలతో కూడిన ఓ సర్క్యులర్ విడుదల చేసింది. మిడతల ముప్పును ఎదుర్కొనేందుకు డీజీసీఏ మార్గదర్శకాలను జారీ చేసింది. ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సిబ్బందికి పలు బాధ్యతలను అప్పగించారు. మిడతలు గాల్లో కనిపించినప్పుడు ఎలా వ్యవహలరించాలి, ఎంత దూరం నుండి వాటి ప్రయాణాన్ని కనుక్కోవాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చే దిశగా విమానయాన సంస్థ సన్నాహాలు చేస్తోంది. మొన్నటి వరకూ కనిపించని కరోనా తో పోరాటం చేసిన ప్రజలు ఇప్పుడు కంటికి కనపడే మిడతలతో యుద్దం చేసే పరిస్ధితులు తలెత్తాయని తెలుస్తోంది.

English summary
The Civil Aviation Department says the fleet is a danger to aircraft if it gets aggressive. Not only that, but it also sets out some precautions. It has also issued guidance on measures to protect aircraft from grasshoppers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X