వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో ఆకుపచ్చ అద్భుతం: అప్పట్లో రాతియుగంలో.. మళ్ళీ ఇప్పుడు.. ఇలా చూడండి!!

ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. 50 వేల ఏళ్ల క్రితం రాతి యుగంలో కనిపించిన ఆకుపచ్చ తోకచుక్క మళ్లీ ఇప్పుడు భూమికి చేరువగా రానుంది. దానిని ఎలా..ఎక్కడ.. ఎప్పుడు చూడాలంటే..

|
Google Oneindia TeluguNews

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. నేడు విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి ఆకుపచ్చ తోకచుక్క భూమికి అతి చేరువగా రాబోతోంది. 50 వేల సంవత్సరాల క్రితం రాతియుగం కాలంలో భూమికి చేరువగా వచ్చిన ఈ తోకచుక్క ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు భూమికి చేరువగా వచ్చి కనువిందు చేయబోతోంది.

50 వేల ఏళ్ళ తర్వాత ఆకుపచ్చని తోకచుక్క అద్భుతం

50 వేల ఏళ్ళ తర్వాత ఆకుపచ్చని తోకచుక్క అద్భుతం


ఆకాశంలో ఈరోజు ఆవిష్కృతం కాబోతున్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరు వీక్షించవచ్చని, నేరుగానే దానిని చూడవచ్చని, అయితే అది స్పష్టంగా కనిపించకపోవచ్చు అని నాసా వెల్లడించింది. 50 వేల సంవత్సరాల క్రితం ఆకుపచ్చని తోకచుక్క భూమికి చేరువగా వచ్చినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత భూమికి అతి చేరువగా రాబోతున్నట్టు, మనందరికీ కనువిందు చేయబోతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నేటి రాత్రే ఆకాశంలో అద్భుతం

నేటి రాత్రే ఆకాశంలో అద్భుతం

ఫిబ్రవరి 1, 2 తేదీల మధ్య రాత్రి ఈ తోకచుక్క ఆకాశంలో కనువిందు చేయనుందని, ఉత్తర దిక్కున ధ్రువ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో అంతరిక్ష పరిశోధకులు ఆకుపచ్చ తోకచుక్కను కనుగొన్నారు. దీనికి శాస్త్రవేత్తలు c/ 2022 E3(ztf) గా నామకరణం చేశారు. ఈ నెలలో అది భూమికి చేరువగా రావడం మొదలైందని, ఈ తోకచుక్క భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానున్నట్టు, నేడు ఆ అద్భుతం జరగబోతున్నట్టు నాసా వెల్లడించింది.

భూమికి దగ్గరగా ఆకుపచ్చ తోకచుక్క

భూమికి దగ్గరగా ఆకుపచ్చ తోకచుక్క

50,000 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రాబోతున్న తోకచుక్కని ఇప్పుడు కాకపోతే మళ్లీ మనం చూసే అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకుపచ్చ తోకచుక్కను నేరుగా కంటితో చూడడం కాస్త కష్టమేనని కోల్కత్తా బిర్లా ప్లానిటోరియం సైంటిఫిక్ అధికారి శిల్పి గుప్తా చెబుతున్నారు. నేరుగా చూస్తే మనకు మసకగా కనిపిస్తుందని స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్ ద్వారా వీక్షించవచ్చని ఆమె సూచిస్తున్నారు.

ఆకుపచ్చ తోకచుక్కను గతేడాది గుర్తించిన శాస్త్రవేత్తలు

ఆకుపచ్చ తోకచుక్కను గతేడాది గుర్తించిన శాస్త్రవేత్తలు

ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాల తరువాత ఈ తోకచుక్క ఆకాశంలో కనిపిస్తుందని, మళ్లీ ఈ తోకచుక్క కనిపించాలంటే మిలియన్ల సంవత్సరం ఎదురుచూడాల్సిందేనని చెబుతున్నారు. అందుకే అందరూ అద్భుతంగా దర్శనమిచ్చే ఈ తోకచుక్కని చూడాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ తోకచుక్కని బృహస్పతి కక్షలో ఉండగా గ తేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారని, అప్పటినుంచి అది వెలుగులు విరిజిల్లుతూనే కనిపిస్తుందని చెబుతున్నారు .

గ్రీన్ కామెట్ ను చూసేందుకు అంతా రెడీనా ?

గ్రీన్ కామెట్ ను చూసేందుకు అంతా రెడీనా ?

తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వేడికి అమితమైన వెలుగులను వెదజల్లుతాయని, అసలు తోకచుక్కలు అంటే వాయువులతో నిండి ఉన్న మంచు గోళాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే , ఎంతో అరుదైన ఆకుపచ్చని తోకచుక్క నేడు భూమికి దగ్గరగా వచ్చి, ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించి మనందరికీ కనువిందు చేయనుంది. చూడటానికి అందరూ రెడీ అయిపోండి.

ఏపీ బాటలో తెలంగాణాలోనూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు; కేసీఆర్ పుట్టినరోజు నాడే!!ఏపీ బాటలో తెలంగాణాలోనూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు; కేసీఆర్ పుట్టినరోజు నాడే!!

English summary
A miracle in the sky will be unveiled tonight. A Rare Green Comet, which came close to the earth 50 thousand years ago, is going to come close to the earth again tonight. ఆ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X