వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్ర‌నేడ్ల దాడి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి పేట్రేగిపోయారు. అయిదో విడ‌త పోలింగ్ సంద‌ర్భంగా బీభ‌త్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్‌మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల‌తో దాడి చేశారు. ఓట‌ర్లు బారులు తీరిన స‌మ‌యంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న అనంత‌రం అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లు స‌మాచారం. గ్రనేడ్ల దాడిలో ప్రాణాన‌ష్టం ఏమైనా సంభ‌వించిందా? లేదా? అనేది ఇంకా తెలియ‌రావాల్సి ఉంది.

దేశ‌వ్యాప్తంగా అయిదో విడ‌త పోలింగ్ సంద‌ర్భంగా జ‌మ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌స‌భ స్థానం కోసం సోమ‌వారం ఉద‌యం పోలింగ్ ఆరంభ‌మైంది. ఇందులో భాగంగా- రోహ్‌మూ పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. ఉగ్ర‌వాదుల దాడి చేయొచ్చ‌నే ఉద్దేశంతోనే ఈ పోలింగ్ కేంద్రాన్ని అత్యంత సున్నిత‌మైన‌దిగా గుర్తించారు ఎన్నిక‌ల అధికారులు. దీనికి త‌గ్గ‌ట్టుగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్య‌లో ఆర్మీ, పోలీసుల బ‌ల‌గాల‌ను మోహ‌రింప‌జేశారు.

Grenade attack on Rohmoo polling station in Pulwama

పోలింగ్ ఆరంభం కావ‌డానికి కొన్ని గంట‌ల ముందే- భారీ ఎత్తున త‌నిఖీలను నిర్వ‌హించారు. ప్ర‌తి వాహ‌నాన్నీ సోదా చేశారు. అయిన‌ప్ప‌టికీ- గ్ర‌నేడ్ దాడి చోటు చేసుకుంది. మిలిటెంట్లు ఈ పోలింగ్ కేంద్రంపై రెండు గ్రనేడ్లు విస‌ర‌గా.. అందులో ఒక‌టి పేల‌లేద‌ని తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అద‌న‌పు పోలీసు, ఆర్మీ బ‌ల‌గాల‌ను రోహ్‌మూ పోలింగ్ కేంద్రానికి త‌ర‌లించారు. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకుని రావ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జైషె మహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహూతి దాడికి పాల్ప‌డిన‌ది పుల్వామా జిల్లాలోనే. జిల్లాలోని అవంతిపురా వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకున్న ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు అమ‌రులైన విష‌యం తెలిసిందే.

English summary
Terrorists Monday lobbed a grenade towards a polling station in Pulwama district of Jammu and Kashmir where polling is under way for the Anantnag Lok Sabha constituency, police said. A grenade was lobbed towards Rohmoo polling station in Pulwama but there were no reports of any casualties in the blast, a police official said. He said security forces have cordoned off the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X