వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ల దాడి: భారీ పేలుడుతో భయాందోళనలు
శ్రీనగర్: హిందూ ఆలయ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడులకు పాల్పడ్డారు. అయితే, ఆ గ్రెనెడ్లు ఆలయం సమీపంలోని పడి భారీ శబ్ధంతో పేలాయి. దీంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన.
పూంఛ్, జమ్మూ జిల్లాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రెనెడ్ దాడి జరగడం గమనార్హం. జమ్మూకాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు ఏదో రకంగా అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

హీరానగర్లోని ఆలయంపైకి గ్రెనెడ్ విసరగా.. అది సమీపంలో పడిపేలిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.