వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశా రవి అరెస్టుపై స్పందించిన గ్రెటా ధన్‌బర్గ్‌- శాంతియుత నిరసనలపై చర్చెందుకు ?

|
Google Oneindia TeluguNews

పర్యావరణ ఉద్యమ కార్యకర్త దిశా రవి అరెస్టుపై ఆమె పనిచేస్తున్న సంస్ధ 'ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌' నడుపుతున్న అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా ధన్‌బర్గ్‌ స్పందించారు. తాజా ట్వీట్‌లో గ్రెటా థన్‌బెర్గ్, "వాక్ స్వాతంత్య్రం, శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులు చర్చించలేని మానవ హక్కులు. ఇవి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఒక ప్రాథమిక భాగం అయి ఉండాలి" అని అన్నారు.

'ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌' ఇండియా ఛాఫ్టర్‌ తరఫున చేసిన ట్వీట్‌లో గ్రెటా ధన్‌బర్గ్ 'స్టాండ్‌ విత్‌ దిశా రవి' హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జతచేశారు.
2018లో 'ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌' ఇండియా ఛాఫ్టర్‌ ను ప్రారంబించిన గ్రెటా ధన్‌బర్గ్‌ ఆ సంస్ధ తరఫున భారత్‌లో పర్యావరణ అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. తాజా పరిణామాలపై పలు ట్వీట్లు చేసిన గ్రెటా ధన్‌బర్గ్‌ "మా మిషన్‌కు అనుగుణంగా, మన పర్యావరణం కోసం శాంతియుతంగా, చురుగ్గా వాదించడం లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.

greta thunberg reacts to Disha Ravis arrest, says right to peaceful protest non-negotiable

దిశా ఈ ఉద్యమంలో ఒక భాగంగా ఉందని, ఆమె భారతదేశంలో పర్యావరణ ఆందోళనలను వ్యక్తం చేయడమే కాకుండా, ప్రపంచ వాతావరణ ఉద్యమంలో దేశం యొక్క అత్యంత ప్రభావిత, అట్టడుగు వర్గాల సమానత్వం మరియు ప్రాతినిధ్యం కోసం కృషి చేసిందని గ్రెటా పేర్కొన్నారు. అంతే కాదు దిశా రవి మనందరిలో అత్యుత్తమమైనదని చెప్పడానికి మాకు ఎలాంటి సంకోచం లేదంటూ గ్రెటా ప్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్స్‌ తరఫున చేసిన ట్వీట్లలో తెలిపారు. దిశా రవి క్రియాశీలత మన గొంతులను శాంతియుతంగా, గౌరవంగా పెంచడం, ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలాచూడటం నేర్పించిందన్నారు.

English summary
Greta Thunberg has reacted to the arrest of environmental activist Disha Ravi in the 'toolkit' case. she says the right to peaceful protest is non-negotiable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X