• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా ‘టూల్ కిట్’ కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?

|

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందని ఆరోపిస్తోన్న కేంద్రం.. ఆ మేరకు 'టూల్ కిట్' కుట్ర కేసులో కీలక చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన టూట్ కిట్(ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక)ను రూపొందించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి(21)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిశ రవి అరెస్టు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు యువ ఉద్యమకారిణి విడుదలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలకు ప్లాన్ చేశారు..

సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలు

కోర్టులో బోరుమన్న దిశ..

కోర్టులో బోరుమన్న దిశ..

ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ఇచ్చిన ట్వీట్‌కు జత చేసిన టూల్‌కిట్‌ను తొలగించాలని గ్రెటా థన్‌బర్గ్‌ను దిశ రవి కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దిశ రవిని బెంగళూరులో శనివారం అరెస్టు చేసి, ఆదివారం న్యూఢిల్లీలోని కోర్టులో హాజరుపరిచారు. పాటియాలా కోర్టు కాంప్లెక్సులోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి దేవ్ సరోహా.. దిశను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. కోర్టు హాలులో బోరున విలపించిన దిశ.. ఆ టూల్ కిట్ తాను రూపొందించలేదని, రెండు సార్లు మాత్రమే ఎడిట్ చేశానని చెప్పుకొచ్చారు.

ఆమెనే సూత్రధారిణి అంటూ..

ఆమెనే సూత్రధారిణి అంటూ..

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ ఇచ్చిన ట్వీట్‌తోపాటు టూల్‌కిట్ డాక్యుమెంట్‌ను జత చేశారు. ఈ టూల్‌కిట్‌కు ఎడిటర్, రూపకర్త దిశ రవి. ఈ టూల్‌‌కిట్‌ను ఇతరులకు పంపించిన వ్యక్తి కూడా దిశ రవి. దీనిలో పేర్కొనవలసిన వివరాలను తెలియజేస్తూ, దీనిని తయారు చేయడంలో ఇతరులతో కలిసి సన్నిహితంగా దిశ రవి వ్యవహరించారు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, టూల్‌కిట్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఖలిస్థాన్ అనుకూలవాదులకు సహకరించారు. కానీ దిశ, ఆమె అనుచరులు మాత్రం ఈ ఆరోపనలను తొసిపుచ్చారు. ఈలోపే..

ఖలిస్థాన్ అనుకూలవాదుల మద్దతు

ఖలిస్థాన్ అనుకూలవాదుల మద్దతు

‘టూల్‌కిట్' కేసులో దిశ రవి అరెస్టును ఖలిస్థాన్ అనుకూల సంస్థ పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) వ్యవస్థాపకుడు మో ధలీవాల్ తీవ్రంగా ఖండించారు. ట్వీట్లు, హ్యాండిల్స్, హ్యాష్‌ట్యాగ్స్ ఉన్న డాక్యుమెంట్ ఆధారంగా దిశను అరెస్టు చేయడం దారుణమని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. అలాంటి డాక్యుమెంట్‌ ఇండియాలో ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేయించగలిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే భారత దేశంలో ఓ డాక్యుమెంట్ కోసం ఎందుకు అరెస్టు చేశారో అడగాలని అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేశారు.

అసలు ఏమిటీ టూల్‌కిట్?

అసలు ఏమిటీ టూల్‌కిట్?

పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ ‘ఆస్క్ ఇండియా వై' అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈ టూల్‌కిట్‌ను రూపొందించి, వ్యాపింపజేసింది. గ్రెటా థన్‌బర్గ్ దీనినే షేర్ చేశారు. దీని శీర్షిక ‘గ్లోబల్ ఫార్మర్స్ స్ట్రైక్-ఫస్ట్ వేవ్'. జనవరి నుంచి ఇది ప్రచారంలో ఉంది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ టూల్‌కిట్ వివిధ వర్గాల వారిని ప్రోత్సహిస్తోంది. ఇండియన్ ఎంబసీలు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, అదానీ, అంబానీ కంపెనీల కార్యాలయాల వద్ద సంఘీభావ నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్తోంది. గణతంత్ర దినోత్సవాలనాడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనాలని కూడా కోరింది. ఈ ట్రాక్టర్ ర్యాలీలో పెద్ద ఎత్తున హింస జరిగింది. ఇదంతా కుట్ర పూరితంగా జరిగినట్లు పేర్కొన్న ఢిల్లీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తొలిగా బెంగళూరుకు చెందిన దిశ రవిని అరెస్టు చేశారు.

 ఎవరీ దిశ రవి? ఆమె కోసం విద్యార్థులు..

ఎవరీ దిశ రవి? ఆమె కోసం విద్యార్థులు..

బెంగళూరుకు చెందిన 21ఏళ్ల సామాజిక ఉద్యమకారిణి దిశ రవి.. ‘ప్రైడే ఫర్ ప్యూచర్' పేరుతో ఓ సంస్థను నడుపుతూ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తుంటారు. బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తూనే ఆమె పర్యావరణ ఉద్యమలో పాలుపంచుకుంటున్నారు. రైతుల నిరసనలకు ముందు నుంచీ మద్దతు తెలుపుతోన్న ఆమె.. గెటా థెన్‌బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ను రూపొందించినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా, దిశపై దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేయడంపై బెంగళూరులోని ఆమె స్నేహితులు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. దిశ విడుదల కోరుతూ వారంతా రోడ్లెక్కి ఉద్యమించేందుకు కార్యాచారణ సిద్దం చేసుకుంటున్నారని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. వాతావరణ మార్పులపై పనిచేస్తోన్న పలు సంస్థలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి.

వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం

English summary
The Delhi Police has issued a statement on toolkit conspiracy accused Disha Ravi through a string of tweets. Activist Disha Ravi breaks down in court, says edited only two lines. Students to protest in Bengaluru, climate group demands Disha Ravi's release
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X