వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితులతో కలిసి బారాత్ లో డ్యాన్స్

వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు మరణించిన విషాదకరఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహమైన తర్వాత జరిగిన బరాత్ లో వరుడు డ్యాన్స్ చేస్తూ తీవ్ర గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని ని

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు మరణించిన విషాదకరఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహమైన తర్వాత జరిగిన బరాత్ లో వరుడు డ్యాన్స్ చేస్తూ తీవ్ర గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

సాధారణంగా వివాహం సమయంలో వరుడి ఇంటికి వధువుతో కలిసి వరుడు వచ్చే సమయంలో వరుడి కుటుంబసభ్యులు, స్నేహితులు డ్యాన్స్ లు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు.అయితే ఇటీవల కాలంలో ఈ తరహా డ్యాన్స్ ల్లో వరుడు కూడ డ్యాన్స్ లు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నాడు.

Groom died in dance after marriage in Gujarat state.

అయితే గుజరాత్ లో మాత్రం ఓ విషాదకర ఘటన చోటుచేసుకొంది. గుజరాత్ లోని రనోఢీ ప్రాంతానికి చెందిన సూరజ్ సోలంకీ అనే యువకుడికి వివాహమైంది. వివాహం అనంతరం బరాత్ లో మిత్రులు పెళ్ళికొడుకును తమ భుజాలపైకి ఎక్కించుకొన్నారు.

అనంతరం డప్పులతో పాటు డీజే సౌండ్ కు మైమరిచిపోయారు. పెళ్ళి కొడుకు కూడ సంతోషంగా తెగ కేకలు పెడుతూ డ్యాన్స్ కు అనుగుణంగా తన శరీరాన్ని కదలించాడు. అయితే హఠాత్తుగా ఆయనకు తీవ్రంగా గుండెపోటు రావడంతో స్నేహితుడి భుజాలపై ఊగిపోతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన చేటుకొంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

English summary
Groom died in dance after marriage in Gujarat state.Suraj solanki married a lady.Solank dance with friends, all of sudden solanki got heart attack ,he died on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X