వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కోసం పాట్లు: మంచు తుఫానులో వరుడు, అతని ఫ్యామిలీ 6 కిలోమీటర్లు నడిచింది

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మంచు కారణంగా వారు వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నడిచి వెళ్లాలని నిర్ణయించారు.

రుద్రప్రయాగ్‌కు చెందిన వరుడు రజనీష్ కూర్మాచారీ సుమారు ఎనభై మంది బంధువులతో కలిసి కార్లలో పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మంచు దట్టంగా కురువడంతో దారిలో కార్లు నిలిచిపోయాయి. వాహనాలు కదల్లేని పరిస్థితి. దీంతో అందరూ ఆందోళన చెందారు.

Groom Treks for 6km in Heavy Snow in Uttarakhand to Reach His Wedding Ceremony

ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే పెళ్లి మండపానికి చేరుకోవచ్చని వారికి తెలిసింది. దీంతో దీంతో వరుడు నడుచుకుంటూ పెళ్లి మండపానికి వెళ్దామని చెప్పాడు. మంచు తుఫానులో నడవడం చాలా కష్టం. మరో మార్గం లేక వారు నడిచి పెళ్లి మండపానికి చేరుకున్నారు.

వరుడు, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నడిచారు. పెళ్లి దుస్తుల్లో వరుడు నడుచుకుంటూ రావడం చూసిన స్థానికులు వారికి సహకారం అందంచారు. దీంతో పెళ్లి ముహూర్తానికంటే చేరుకున్నారు.

English summary
Marriage is not a simple event in India! Bride, groom and their families have to go through a lot to make a simple marriage successful. The same type of struggle was seen in Uttarakhand’s Rudraprayag where a groom and his relatives walked over 6 km in heavy snow to attend wedding ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X