వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వరుడు కావలెను’: ‘గే’ పెళ్లి కోసం తొలిసారి పత్రికా ప్రకటన

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ తల్లి తన గే కొడుకు కోసం ఒక పత్రికా ప్రకటన చేయాలని అనుకుంది. అది చాలా కష్టం కూడుకున్నదైనప్పటికీ ఆమె కొడుకు కోసం ఆ పని చేసేందుకు ప్రయత్నించారు. తన కొడుకు గే కావడం వల్ల ఆమె తన కొడుకు కోసం ‘భర్త కావలెను' అనే ప్రకటనను ఓ పత్రికా ద్వారా వెల్లడించాలని చూశారు. అయితే సదరు పత్రిక ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది.

దీంతో ఆమె కోర్కెను తీర్చేందుకు గే కొడుకు రంగంలోకి దిగాడు. ప్రముఖ గే హక్కుల పోరాట కార్యకర్త హరీశ్ అయ్యర్ తన కోసం ఒక మంచి భర్త కావాలని ‘యునిక్ మేట్రిమోనీ'లో ప్రకటన ఇచ్చారు. గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్‌జిబిటి) వర్గాల గురించి భారతదేశం లాంటి దేశంలో చర్చించడం కూడా అవమానంగా, సిగ్గు భావిస్తారని అయ్యర్ తెలిపారు.

ఇలాంటి దేశంలో ఒక గేకు ‘భర్త కావాలెను' అనే ప్రకటన ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పనేనని చెప్పారు. తన తల్లి దేశంలోని ప్రముఖ పత్రికలకు ప్రకటన ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే ఆయా యాజమాన్యాలు తిరస్కరించాయని తెలిపారు. చివరకు ‘మిడ్ డే' అంగీకరించడంతో తన ప్రకటనను వేసుకున్నారు.

 Groom Wanted: This gay man breaks social taboo in India with unique matrimony ad

ఆ ప్రకటన సారాంశం ‘వయస్సు 25-40, మెరుగైన స్థితి, జంతు ప్రేమికుడు, శాఖాశారియైన భర్త నా కొడుకు కోసం కావాలెను(36, 5'11''), నా కొడుకు ఎఎన్జీవోలో పని చేస్తున్నాడు, కులం అవసరం లేదు(అయ్యర్‌లకు ప్రాధాన్యం)'.

కాగా, మిడ్ డే ఎడిటర్ సచిన్ కాల్బాగ్ నుంచి వచ్చిన ఈమెయిల్‌ buzzfeed గురించి ఈ విధంగా రాసింది. ‘వివాహం అంటే ఆలోచనలు, ఆత్మల కలయిక. మిడ్ డేలో మేము ఇది నమ్ముతాం. మానవ హక్కులు అందరికీ వర్తించాలి. కుల, మత, వర్ణ, లింగ భేదం.. లేకుండా ఇది జరగాలి'.

‘ఓ తల్లి తన గే కొడుకు కోసం మంచి భర్తను ఇవ్వాలనుకుంటోంది. అతను ఎంతో సాధారణంగా ఉన్నారు. అతడ్ని భిన్నంగా ఎందుకు చూడాలి. అతని గురించి ఎందుకు భిన్నంగా ఎందుకు ఆలోచించాలి. ఇక్కడ అందరూ సమానం' అని మెయిల్‌లో పేర్కొన్నారు.

English summary
It was not easy for him to go ahead with his mother's decision of placing a 'Groom Wanted' matrimony ad on newspaper. Harish Iyer, a well-known gay activist, finally decided to search for a groom for himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X