వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుస్తుల పైనుంచి స్తనాలను నొక్కడం లైంగిక దాడి కాదా..? బాంబే హైకోర్టు సంచలన తీర్పు...

|
Google Oneindia TeluguNews

బాలికపై లైంగిక దాడికి సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలిక దుస్తులపై చేతులతో తడమడం పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని... లైంగిక ఉద్దేశంతో స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్(శారీరక స్పర్శ) జరిగినప్పుడు మాత్రమే దాన్ని లైంగిక దాడిగా పరిగణిస్తామని పేర్కొంది. ఇదే కారణంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ పుష్ప గనేదివాలా వెలువరించిన ఈ తీర్పు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

ఇదీ ఘటన నేపథ్యం...

ఇదీ ఘటన నేపథ్యం...


12 ఏళ్ల ఓ బాలికపై నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. జామకాయ ఇస్తానని ఆశచూపి.. ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన అతను ఆమె స్తనాలను చేతులతో నొక్కడంతో పాటు పాక్షికంగా వివస్త్రను చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం... కోర్టు అతన్ని దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును అతను బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్ కోర్టులో సవాల్ చేశాడు.

కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే...

కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే...

లైంగిక దాడి కేసులో దోషిగా ఉన్న అతని పిటిషన్‌పై నాగపూర్ సింగిల్ బెంచ్ కోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం... బాలిక పై భాగంలోని దుస్తులను(టాప్) తొలగించకుండా అతను స్తనాలను ప్రెస్ చేశాడా అన్నది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. 'బాలిక ధరించిన దుస్తుల పైభాగం తొలగించబడిందా లేదా పైభాగం లోపల అతని చేతిని చొప్పించి ఆమె స్తనాలను తాకాడా అనే దానిపై నిర్దిష్ట వివరాలు లేనప్పుడు... ఈ చర్యను 'లైంగిక వేధింపు'ల నిర్వచనంలోకి తీసుకోలేము.' అని పేర్కొన్నారు.

Recommended Video

#BulletTrain : Ahmedabad-Mumbai రైలు మార్గ నిర్మాణానికి కీలక అడుగు.. అతిపెద్ద కాంట్రాక్టుగా Record
పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ఏం చెబుతోంది...

పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ఏం చెబుతోంది...

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 ప్రకారం మహిళా ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన నిందితుడి చర్యను నేరపూరితంగా గుర్తించినప్పటికీ.. POCSO చట్టం కింద ఈ చర్యను లైంగిక దాడిగా పరిగణించలేమని కోర్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద అతనిపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం... బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం లేదా ఆమెతో తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకించడాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే లైంగిక ఉద్దేశంతో శారీరక స్పర్శకు పాల్పడినా లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఈ కేసులో అలాంటిది జరిగిందని చెప్పడానికి నిర్దష్టమైన ఆధారాలు,వివరాలు లేనందునా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

English summary
In a recent ruling by the Nagpur bench of the Bombay High Court, it was observed that there should be "skin-to-skin contact with sexual intent" in order to be considered as sexual assault. The ruling also said that 'mere groping' will not fall under sexual assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X