వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీడీపీ కాదు.. ‘జీహెచ్‌పీ’ని కోరుకుంటున్నారు: ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి జీడీపీ ఎంత అవసరమో.. విద్య, సఖ సంతోషాలు కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రాసిన 'శిక్షా' అనే పుస్తక ఆవిష్కరణ సభలో గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

'చేతిలో నవజాత శిశువున్నట్లు..': చంద్రయాన్ 2 ల్యాండింగ్‌పై ఇస్రో ఛైర్మన్ ఏమన్నారంటే?'చేతిలో నవజాత శిశువున్నట్లు..': చంద్రయాన్ 2 ల్యాండింగ్‌పై ఇస్రో ఛైర్మన్ ఏమన్నారంటే?

జీడీపీ అభివృద్ధి లాగే స్థూల సంతోషం కూడా అవసరమని, ప్రజల సుఖసంతోషాలకు విద్య ద్వారానే పునాదులు పడతాయని ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. నేటి ప్రపంచం కేవలం జీడీపీ గురించి మాత్రమే ఆలోచించడం లేదు.. వారు ఇంకా ఏదో కావాలలనుకుంటున్నారని ఆయన చెప్పారు. జీడీపీ లాగే 'గ్రాస్ హ్యాపీనెస్ ప్రోడక్ట్(జీహెచ్‌పీ)' అనే కొత్త విధానం కూడా ముఖ్యమని అన్నారు.

 ‘Gross Happiness’ is as important as GDP growth: Former president Pranab Mukherjee

జీడీపీ అభివృద్ధి దేశానికి ఎంత అవసరమో.. జీహెచ్‌పీ కూడా ప్రజలకు అంతే అవసరమని ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ జీడీపీ గణనీయంగా పడిపోయిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక సిసోడియా పుస్తకం గురించి మాట్లాడుతూ.. కేవలం పరిశోణకే గాక.. ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులకు 'శిక్షా' అనే ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన స్వీయ అనుభవం, పరిశీలనతో ఈ పుస్తకాన్ని రచించారని ప్రశంసించారు. గూగుల్ టెక్ట్స్ టు స్పీచ్ టూల్ సాయంతో ఈ పుస్తకాన్ని పూర్తి చేశానని సిసోడియా ఈ సందర్భంగా తెలిపారు.

English summary
Attending an event in Delhi, Former president Pranab Mukherjee said that Gross Domestic Product (GDP) is not enough as a parameter of economic growth. He said, “The world today is not merely talking about Gross Domestic Product (GDP), world wants more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X