నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్రో మరో కీలక ప్రాజెక్టు: భూ ఉపరితలాన్ని మరింత స్పష్టంగా: వచ్చే నెలే..శ్రీహరికోట నుంచి..!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న ఇస్రో.. ఈ సారి జియో ఇమేజింగ్‌పై గట్టి పట్టు సాధించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా- అత్యాధునిక పరికరాలతో కూడిన జియో ఇమేజింగ్ శాటిలైట్‌ జీశాట్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. వచ్చేనెల 5వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది.

Recommended Video

3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi | Oneindia Telugu

దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు వెల్లడించింది. జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 10 రాకెట్ జీశాట్-1ను మోసుకెళ్తుంది. శ్రీహరికోట ప్రయోగ కేంద్రంలోని రెండో నంబర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్‌వీని ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఎప్పుడనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని, వాతావరణ పరిస్థితులను బట్టి కౌంట్‌డౌన్ సమయాన్ని నిర్ధారిస్తామని పేర్కొంది

GSLV-F10 to launch GISAT-1 on March 05, 2020 from SHAR by Isro

జీశాట్-1 ఉపగ్రహం బరువు 2275 కేజీలు. ఎర్త్ అబ్జర్వేషన్‌ కోసం అత్యాధునికమైన పరికరాలను ఇందులో అమర్చారు. జియో సంక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ వంటి పరికరాలను అమర్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. భూఉపరితలాన్ని మరింత స్పష్టంగా ఫొటోలు తీయడానికి ఇది ఉపకరిస్తుందని వెల్లడించారు. భారత ఉపఖండం మొత్తాన్నీ సునిశితంగా పరిశీలించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ తరహా ఉపగ్రహాన్ని జీఎస్ఎల్‌వీ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతుండటం ఇదే తొలిసారి అని చెప్పారు.

GSLV-F10 to launch GISAT-1 on March 05, 2020 from SHAR by Isro
English summary
Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F10) will launch Geo Imaging Satellite (GISAT-1) from the Second Launch Pad of Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. said ISRO. The launch is tentatively scheduled at 1743 Hrs IST on March 05, 2020, subject to weather conditions. Weighing about 2275 kg, GISAT-1 is a state-of-the-art agile Earth observation satellite which will be placed in a Geosynchronous Transfer Orbit by GSLV-F10. Subsequently, the satellite will reach the final geostationary orbit using its onboard propulsion system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X