• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంపిక చేయబడ్డ కోవిడ్ మెడిసిన్స్‌పై రాయితీ పొడిగింపు: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం

|

కరోనా వేళ.. మెడిసిన్స్ కంపల్సరీ అయిపోయింది. డాక్టర్లను సంప్రదించకుండానే మందులు తీసుకునే పరిస్థితి. ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ కిట్ కూడా అందజేశారు. ఈ క్రమంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఎంపికచేసిన కోవిడ్ మందులకు రాయితీలను పొడగించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు కన్సిషన్ ఉంటుందని కౌన్సిల్ తెలియజేసింది. ఈ మేరకు సీఎన్‌బీసీ-టీవీ 18 రిపోర్ట్ చేసింది.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

5 శాతం వరకు తగ్గింపు..

5 శాతం వరకు తగ్గింపు..

45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ తర్వాత తొలిసారిగా ఫిజికల్ మీటింగ్ జరుగుతోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌కు సంబంధించి మందులపై 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం వరకు తగ్గిస్తున్నామని ప్రకటించారు ఐటొలిజుమాబ్, పొసాకాన్‌జొల్, ఇన్‌ఫిక్స్‌మాబ్, బామాలాన్విమాబ్, ఈటెసెవిమాబ్, కాసిరివిమాబ్, ఇంబెవిమాబ్, 2 డాక్సీ డీ గ్లూకొజ్, ఫెవిఫిరవిర్ మందులపై రాయితీ ఉంటుందని తెలియజేసింది. ఇంతకుముందు సెప్టెంబర్ 30వ తేదీ వరకు తగ్గించాలని ప్రతిపాదించింది. దానిని మరో 3 నెలలు ఎక్స్ డెంట్ చేసింది.

కొన్నింటికీ నో జీఎస్టీ

కొన్నింటికీ నో జీఎస్టీ


ఇక మిగతా మందుల విషయానికి వసతే ఆంఫొటెరిసన 5 శాతం రాయితీ ఉండే దానిని మొత్తానికి తీసివేశారు. టొసిల్ మాబ్ కూడా జీరో చేశారు. రెమిడెసివర్ 12 శాతం నుంచి 5 శాతం చేశారు. హెపరిన్ కూడా 12 నుంచి 5 శాతం చేశారు. అలాగే సిక్సింకు 1శాతం లేవి ఇవ్వడానికి కౌన్సిల్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. మూడేళ్లపాటు ఇవ్వబోమని చెప్పినట్టు సమాచారం. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. దీంతోపాటు ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీకి కూడా 5 శాతం జీఎస్టీ విధించాలనే అంశం డిస్కషన్ వచ్చింది.

థర్డ్ వేవ్..

థర్డ్ వేవ్..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వ్యాక్సిన్

వ్యాక్సిన్


వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
Goods and Services Tax Council has extended the concessions to specified drugs used in COVID-19 treatment till December 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X