వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ: హమ్మయ్య.. బంగారం బతికిపోయింది, 3 శాతమే పన్ను! ఇంకా వేటిపై ఎంతెంత అంటే..

బంగారంపై 3 శాతం పన్ను విధించాలని శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. బంగారంతోపాటు ఆభరణాలు , వజ్రాలు, వెండిపై 3 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హమ్మయ్య.. బంగారం బతికిపోయింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ బంగారంతోపాటు ఆభరణాలు , వజ్రాలు, వెండిపై 3శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.

జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొన్ని వస్తువులపై రేట్లను ఖరారు చేసేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశమైంది.

gold

రెడీమేడ్‌ దుస్తులపై 12 శాతం, నూలు, చేనేత వస్త్రాలపై 18శాతం, రూ.500లోపు ఉన్న పాదరక్షలపై 5 శాతం, రూ.500 దాటిన పాదరక్షలపై 18 శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.

సిల్కు, జనపనార ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.వెయ్యి లోపు వస్త్రాలపై 5 శాతం, బీడీలపై 28 శాతం, బ్రాండెడ్‌ బిస్కెట్లపై 18 శాతం, సౌర పలకలపై 5 శాతం చొప్పున పన్ను విధించారు.

గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్‌ ఈ రోజు జరిగిన సమావేశంలో పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌లు పాల్గొన్నారు.

కొన్ని శ్లాబులపై అభ్యంతరాలున్నాయి: ఈటల

జీఎస్‌టీ శ్లాబులపై తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలుచేయాలని అంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడంపై దృష్టిపెట్టాలని, లేకపోతే గందరగోళం నెలకొంటుందన్నారు.

కొన్ని శ్లాబ్‌లపై ఉన్న అభ్యంతరాలను ఈ నెల 11న మళ్లీ ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. సినిమా రంగంపై ప్రస్తుతం పన్ను ఎక్కువగా ఉందని, దాన్ని 12 శాతంగా నిర్ణయించాలని తాము ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు.

English summary
The GST Council today decided to tax gold at 3 per cent, footwear below Rs 500 at 5 per cent and biscuits at 18 per cent under the Goods and Services Tax, which will be rolled out from July 1. The Council, chaired by Finance Minister Arun Jaitley, at its 15th meeting also decided on rates of yarns, agriculture machinery, apparels and rough diamonds among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X