వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్స్‌పై జీఎస్టీ ఎఫెక్ట్?: ఎవరికి లాభం?; తగ్గేవి.. పెరిగేవి.. ఇదీ జాబితా!

350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్ పై గతం కన్నా ఒక్క శాతం ఎక్కువగా.. అంటే 31శాతం పన్ను అమలవుతుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎక్కడ విన్న జీఎస్టీ గురించే చర్చ. లాభ-నష్టాల బేరీజు.. ధరల నియంత్రణపై చర్చల్లో అటు మీడియా, ఇటు జనం తలమునకలయ్యారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, సామాన్యుడి అవసరాల రీత్యా జీఎస్టీ ఎలా ప్రభావం చూపించనుంది అనేదానిపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాహన రంగంపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉండనుండనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ద్విచక్రవాహనాలపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వారిలో మెదులుతోన్న ప్రశ్న.

గతంలో ద్విచక్ర వాహనాలపై 30శాతంగా ఉన్న పన్ను తాజా జీఎస్టీ అమలుతో 28శాతానికి తగ్గడంతో.. వాటి ధరలు స్వల్పంగా తగ్గనున్నాయనేది మధ్య తరగతి వర్గానికి కొంత అనుకూలంగా ఉన్న విషయం. అయితే ఇంజన్ సామర్థ్యం 350సీసీ లోపు ఉన్న ద్విచక్ర వాహనాలకే ఇది వర్తిస్తుంది. 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్ పై గతం కన్నా ఒక్క శాతం ఎక్కువగా.. అంటే 31శాతం పన్ను అమలవుతుంది.

తగ్గే వాటి జాబితాలో ఇవి:

బజాజ్ ఆటో:

బజాజ్ ఆటో:

ఈ కంపెనీ ఉత్పత్తి చేసే.. అవేంజర్ అండ్ వీ రేంజ్, కేటీఎమ్ డ్యూక్ 200, ఫుల్ పల్సర్, డిస్కవర్, ప్లాటినా, కేటీఎమ్ ఆర్‌సీ-200.. వంటి బైక్స్ రూ.1000 నుంచి రూ.7వేల వరకు ధరలు తగ్గే సూచనలున్నాయి.

జీఎస్టీతొ వృద్ది అనేది చెత్త మాట.. అసలు వ్యవహారం ఇదీ!: దేవ్‌రాయ్ సంచలనంజీఎస్టీతొ వృద్ది అనేది చెత్త మాట.. అసలు వ్యవహారం ఇదీ!: దేవ్‌రాయ్ సంచలనం

హోండా:

హోండా:

హోండా కంపెనీ నుంచి వచ్చే.. యునికార్న్, డ్రీమ్ సిరీస్, షైన్, లివో, సీడీ, యాక్టివా, డియో, ఏవియేటర్, నవీ, క్లిక్.. వంటి ద్విచక్ర వాహనాలపై రూ.1000 నుంచి రూ.5వేల వరకూ తగ్గే అవకాశం ఉంది.

జీఎస్టీ పుణ్యమాని.. మాల్స్‌కు పండుగ : దివాళీ వచ్చిందా అన్నట్లు కళకళ.. జీఎస్టీ పుణ్యమాని.. మాల్స్‌కు పండుగ : దివాళీ వచ్చిందా అన్నట్లు కళకళ..

సుజుకీ:

సుజుకీ:

సుజుకీ బ్రాండ్ ద్విచక్ర వాహనాలు.. గిక్సర్ రేంజ్, హయతే, సుజుకీ యాక్సెస్, వంటి వాటిపై రూ.1000 నుంచి రూ.2500 మేర ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

హీరో మోటార్‌కార్ప్:

హీరో మోటార్‌కార్ప్:

హీరో బ్రాండ్స్ అయిన ద్విచక్ర వాహనాలు.. స్ప్లెండర్, ప్యాషన్, గ్లామర్, అచీవర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, కరిజ్మా, డ్యుట్, ప్లెషర్, మాస్ట్రో మోడల్స్‌పై గతంలో 30.2 శాతం పన్ను అమలయ్యేది. ప్రస్తుతం ఇది 28శాతానికి తగ్గినందు వల్ల వీటిపై రూ.1000 నుంచి రూ.2వేల వరకూ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

యమహా:

యమహా:

యమహా ఉత్పత్తులు.. శల్యూటో, ఎఫ్‌జడ్, ఎస్‌జడ్, ఫేజర్, ఆర్15, ఎఫ్‌జడ్25, ఫ్యాసినో, ఆల్ఫా, రే.. వాటిపై రూ.1000 నుంచి రూ.2500 వరకు ధరలు తగ్గవచ్చునని అంచనా.

ధరలు పెరిగేవి:

ధరలు పెరిగేవి:

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500, కేటీఎం 390డ్యుక్, కేటీఎం ఆర్సీ 390, హార్లే డేవిడ్ సన్, డుకాటి వంటి బైక్స్ ధరలు గతం కన్నా మరింతగా పెరగనున్నాయి. వీటిపై అదనంగా 3శాతం మేర సెస్ వసూలు చేయనున్నారు.

English summary
GST effect on bikes will now impact prices of two-wheelers as the Goods and Services Tax (GST) comes into place, as of today, the 1 July 2017, but only marginally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X