వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి ఫస్ట్ నుంచి తక్కువ ధరలు.. ఆ వస్తువులేంటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

GST New Rates From Today : Here's The List Of Items Get Cheaper

ఢిల్లీ : 23 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ ధరలు జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ లో 23 రకాల వస్తు సేవలపై శ్లాబులు తగ్గించారు. టీవీలు, మానిటర్లు, పవర్ బ్యాంకులు, సినిమా టికెట్లు, నిల్వ చేసిన కూరగాయలు ఇలా సామాన్యులకు అందుబాటులో ఉండే 23 రకాల వస్తు సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీట్రేడింగ్ టైర్లు, లిథియం ఆయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో గేమ్స్, కప్పీలు.. ఇలాంటి వాటిపై 28 శాతంగా ఉన్న జీఎస్టీ పన్నును 18 శాతానికి తగ్గించారు.

 gst effect price reduced on 23 items from january first

ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు ఉపయోగించే యంత్రాలు, పరికరాలపై ఇప్పటివరకు అమలవుతున్న 28 శాతం జీఎస్టీని 5 శాతానికి కుదించారు. సరుకు రవాణా చేసే వాహనాలకు సంబంధించి థర్డ్ పార్టీ భీమా ప్రీమియం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ప్యాక్డ్ కూరగాయలతో పాటు నిల్వ చేసిన కూరగాయలు, కెమికల్స్ తో భద్రపరిచే కూరగాయలు లాంటి వాటికి జీఎస్టీ నుంచి మొత్తానికే పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక జన్‌ధన్‌ యోజన ఖాతాదారులను కూడా జీఎస్టీ పన్ను బాధ నుంచి విముక్తి కల్పించారు.

English summary
The GST percentage cut on 23 items will come into effect from January first. TV's, monitors, power banks, cinema tickets, and stored vegetables have made the decision to cut the GST on 23 products which are mostly available to the common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X