వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ ఎఫెక్ట్: ఎల్ పి జీ గ్యాస్ సిలిండర్ పై రూ. 32 అదనపు భారం

జిఎస్టీ ఎఫెక్ట్ ఎల్ పి జీ గ్యాస్ పై పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 32 లు అదనంగా భారం పడనుంది. ఆరేళ్ళలో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ పై మరింత పడింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిఎస్టీ ఎఫెక్ట్ ఎల్ పి జీ గ్యాస్ పై పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 32 లు అదనంగా భారం పడనుంది. ఆరేళ్ళలో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ పై మరింత పడింది.

గృహ వినియోగ ఎల్ పిజీ సిలిండర్ పై 2011 జూన్ 25న, రూ.50 పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో అప్పట్లో ఈ ధరను పెంచకతప్పదని ప్రభుత్వం ప్రకటించింది.

GST Impact: LPG costlier on GST, lower subsidy

జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాయితీ గల ఎల్ పీ జీ పై 5 శాతం పన్నును విధించారు. గతంలో 5 శాతం కన్నా తక్కువ పన్ను ఉన్న రాష్ట్రాల్లో తాజా విధానంతో గృహ వినియోగ ఎల్ పి జీ సిలిండర్ ధర పెరుగుతోంది. కోల్ కతాలో ఒక్కో సిలిండర్ రూ.31.67 పెరిగింది. దీంతో రూ.480.32 మారింది. చెన్నైలో జిఎస్టీ ధరతో రూ.465.56 లకు సిలిండర్ లభ్యం కానుంది.

ముంబైలో గతంలో 3 శాతం వ్యాట్ ఉండేది. దీంతో ప్రస్తుతం రూ.14.28 పెరిగింది. ఒక్కో సిలిండర్ రూ.491.25 కు లభ్యం కానుంది. గతంలో ఎల్ పిజీ పై ఎక్సైజ్ సుంకం ఉండేదికాదు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ లేదా అమ్మకపు పన్ను 1 శాతం నుండి 5 శాతం వరకు ఉండేది. ఢిల్లీ, చంఢీఘడ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ , తమిళనాడు , ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ , కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాట్ లేదా అమ్మకపు పన్ను ఉండేవి కావు.

English summary
Households will have to shell out up to Rs 32 more for each cooking gas (LPG) cylinder from this month due to the twin impact of GST and a reduction in subsidy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X