వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దేశమంతా ఇక ఒకే పన్ను విధానం', 'జిఎస్టీ అంటే టీమిండియా'

దేశమంతటా ఒకే పన్నుల విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జిఎస్టీని ప్రారంభించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే పన్నుల విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జిఎస్టీని ప్రారంభించారు.

పార్లమెంట్ సెంట్రల్ హల్ లో శుక్రవారం అర్ధరాత్రి జిఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ భవనాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని దేవేగౌడ, లోకస్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

జీఎస్టీ ప్రారంభోత్సవానికి హజరుకాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ బాటలోనే వామపక్షాలు డీఎంకె లు నడిచాయి.అయితే ఎన్ సి పి ఆ కార్యక్రమంలో పాల్గొంది. మరో వైపు ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడ ఒకే రమైన పన్ను విధానం అమల్లోకి రానుంది.

జిఎస్టీని ప్రారంభించేందుకు చాలా ఏళ్ళుగా ప్రయత్నాలు సాగుతున్న విషయాన్ని పలువురు ప్రస్తావించారు. అయితే కేంద్ర, రాష్ట్రాల మధ్య సమానత్వం సాధించే దిశగా ఈ జిఎస్టీ దోహడపడిందనే అభిప్రాయాన్ని పలువురు పేర్కొన్నారు.

జిఎస్టీ ప్రారంభం

జిఎస్టీ ప్రారంభం

జిఎస్టీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ప్రారంభించారు. 2002 లోనే జిఎస్టీ ప్రక్రియ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2009 నవంబర్ మాసంలో జిఎస్టీ తొలిసమావేశం జరిగిందన్నారు. 2011,2012 లలో ఆర్థికమంత్రిగా తానే కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేసుకొన్నారు. పన్ను విధానాల్లో అత్యంత సమగ్రమైంది జిఎస్టీ అని చెప్పారు. ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుందన్నారు.

టీమిండియా భావనకు జిఎస్టీ నిదర్శనం

టీమిండియా భావనకు జిఎస్టీ నిదర్శనం

టీమిండియా భావనకు జిఎస్టీ నిదర్శనంగా నిలుస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జిఎస్టీ ఆవిష్కరణకు కొద్ది క్షణాల ముందుగా మోడీ పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ప్రసంగించారు. జిఎస్టీ వ్యవస్థ సరళమైంది.చిన్న సాఫ్ట్ వేర్ తో తమ పన్నులను తామే చెల్లించుకోవచ్చన్నారు. జిఎస్టీని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా ఆయన అభివర్ణించారు. సర్ధార్ పటేల్ దేశంలో అనేక సంస్థాలను విలీనం చేశారు. జిఎస్టీ దేశాన్ని ఏకం చేస్తోందని మోడీ చెప్పారు. అఖిలపక్ష వాదనల నుండి మధ్యే మార్గాన్ని ఎంచుకొని జిఎస్టీ ఏర్పడిందన్నారు.భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్టే జిఎస్టీ 18 సమావేశాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.గంగానగర్ నుండి ఇటా నగర్ , లేహ్ నుండి లక్షద్వీప్ వరకు ఒకే పన్ను ఉంటుందన్నారు.

ఒకే దేశం ఒకే పన్ను

ఒకే దేశం ఒకే పన్ను

దేశం సాధించిన గొప్ప విజయాల్లో జిఎస్టీ ఒకటని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జిఎస్టీతో కొత్త ప్రయాణం ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశంలో ఒకే పన్ను విధానం అమలు కానుందన్నారు. అధికారులు ఎంతగానో దీనికోసం శ్రమించారని ఆయన గుర్తుచేశారు. ఎన్టీఏ 1 పాలనలోనే జిఎస్టీ అంశం తెరమీదికి వచ్చిందన్నారు. విజయ్ కేళ్కర్ తన నివేదికలో జిఎస్టీ అంశాన్ని తెరమీదికి తెచ్చారన్నారు.అయితే దీన్ని అమలుచేసేందుకు 15 ఏళ్ల సమయం పట్టిందన్నారు.

అర్థరాత్రి పూట సమావేశాలు

అర్థరాత్రి పూట సమావేశాలు


పార్లమెంట్ అర్థరాత్రి పూట ఇప్పటికి మూడు దఫాలు మాత్రమే ప్రత్యేకంగా సమావేశమైంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే అర్ధరాత్రి పూట పార్లమెంట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రదినోత్సవ రజతోత్సవ సమయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. మరో సారి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగానే సమావేశం జరిగింది. అయితే దేశానికి ఆర్థిక సంస్కరణలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయే జిఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాను పార్లమెంట్ అర్ధరాత్రి పూట ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

English summary
In the making since 2000, the Goods and Services Tax (GST) will finally kick-in from July 1.The GST will be launched at midnight at a function inside Parliament’s Central Hall.Touted by the government as the biggest tax reform since Independence, the GST is meant to boost growth and scrap local taxes that add to overhead costs and stymie businesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X