వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి!: రోజుకు 10వేల మంది ఫోన్ కాల్స్..

ఎస్టీ విధానంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తున్నామని జీఎస్టీ నెట్ వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జూన్ 30 అర్థరాత్రి తర్వాతి నుంచి దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ అయితే అమలైంది గానీ దీనికి సంబంధించి చాలామందిలో ఇంకా సందేహాలు నివృత్తి కాలేదు. సందేహాల సంగతి అటుంచితే.. జీఎస్టీ నెట్ వర్క్ గురించి, దాని ప్రయోజనాల గురించి మంత్రులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు సైతం సరైన అవగాహన లేని పరిస్థితి.

నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత టార్గెట్ అవే: మరో బాంబు పేల్చిన జైట్లీనోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత టార్గెట్ అవే: మరో బాంబు పేల్చిన జైట్లీ

ఈ నేపథ్యంలోనే ప్రజలకు జీఎస్టీపై సందేహాలు నివృత్తి చేయడం కోసం కేంద్రం కొన్ని హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ నంబర్లకు రోజుకు సగటున 10వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని జీఎస్టీ నెట్ వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు. ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు, సహా పలు రంగాలకు చెందినవారు ఈ కాల్స్ చేస్తున్నట్లు తెలిపారు.

GSTN receives 10,000 calls per day, says Chairman Navin Kumar

జీఎస్టీ విధానంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం నోయిడా నుంచి కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 400మంది ఎగ్జిక్యూటివ్‌లు పనిచేస్తున్నారన్నారు. రెండు కొత్త సర్వీసుల కోసం జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించిందన్నారు.

జీఎస్టీ హెల్ప్ లైన్:

Email: [email protected]

Telephone: 1800 1200 232

జీఎస్టీఎన్ హెల్ప్ డెస్క్:

Email: [email protected]

Telephone: 0120 4888999

Twitter handles: @askGST_GOI, @askGSTech

వీటితో పాటు మరో రెండు హెల్ప్ లైన్ సెంటర్లను పన్ను చెల్లింపుదారుల కోసం, పన్ను అధికారుల కోసం ఏర్పాటు చేశారు. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలతో కలిసి జీఎస్టీఎన్ నెట్ వర్క్ వీటిని ఏర్పాటు చేశారు.

పన్ను చెల్లింపుదారులకు హెల్ప్ లైన్స్:
0120-4888999

పన్ను అధికారులకు హెల్ప్ లైన్:
0124-4479900

English summary
Following the successful rollout of the Goods and Services Tax (GST), the GST Network (GSTN) has been receiving an average of 10,000 calls per day from traders and tax payers to clear their confusion and help them adapt to the new tax regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X