వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 నుంచి మోగనున్న బడిగంట.. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కంటిన్యూ, విద్యాశాఖ గైడ్‌లైన్స్ ఇవే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల స్కూళ్లు తెరుచుకునే లేదు. కానీ అన్ లాక్ 5.0లో విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ అందుకు తగిన సలహాలు/ సూచనలు కూడా పాటించాలని స్పష్టంచేసింది. కానీ స్కూల్స్ ఓపెన్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ వదిలేసింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. పదండి.

స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు ఓపెన్..

స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు ఓపెన్..

ఈ నెల 15 నుంచి స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు తెరవొచ్చని కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మెలిక పెట్టింది. కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా పాటించాలని తేల్చిచెప్పింది. స్కూళ్లలోని క్లాస్ రూం, అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది.

గాలి, వెలుతురు సరిగా రావాలి..

గాలి, వెలుతురు సరిగా రావాలి..

తరగతి గదుల్లో గాలి ప్రసరణ ఎక్కువగా ఉండేలా చూడాలని సజెస్ట్ చేసింది. ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా సీటింగ్ లో మార్పులు చేయాలని సూచించింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలను విధిగా చేయాలని చెప్పింది. రక్షణ, ఇతర సహాయ చర్యల కోసం పాఠశాలల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. అదేవిధంగా పాఠశాలల్లో ఎలాంటి ఈవెంట్లు, ఫంక్షన్లు చేయొద్దని చెప్పింది.

పేరంట్స్‌కి తెలియజేయాలి..

పేరంట్స్‌కి తెలియజేయాలి..


పాఠశాలల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరింది. పిల్లలు బడికి వచ్చేందుకు తల్లిండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తీసుకోవాలని సూచించారు. అటెండెన్స్ విధానంలోనూ మార్పులు చేయాలని చెప్పింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులు, టీచర్లు ఇళ్లలోనే ఉండేందుకు అవకాశం ఇవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్‌కు రావొద్దని తేల్చిచెప్పింది.

ఆన్ లైన్/ స్కూల్‌కు రావడం

ఆన్ లైన్/ స్కూల్‌కు రావడం

విద్యార్థులు ఆన్ లైన్ క్లాసు/ స్కూల్ రావడం.. ఏ విధానంలో అయినా క్లాసులు వినే అవకాశం కల్పించాలన్నారు. అనారోగ్యంగా ఉంటే ఇళ్లలోనే ఉండేలా సిక్ లీవ్ విధానం అమలు చేయాలని కోరింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి.. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని కోరింది. విద్యార్థులపై భారం పడకుండా కొత్త అకడమిక్ క్యాలెండర్ తయారు చేయాలని విద్యాశాఖ సూచించింది. విద్యా విధానం లెర్నర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. పరీక్షల నిర్వహణ విషయంలోనూ విభిన్న పద్ధతులు పాటించాలని సజెస్ట్ చేసింది. ఈ నియమ, నిబంధనలను పాటిస్తూ.. స్కూల్స్ తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

English summary
guidelines for reopening of schools from 15th october in the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X