వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 సంవత్సరంలో దేశంలో గిన్నిస్ బుక్ రికార్డులివే .. ఆశ్చర్యపరిచే టాలెంట్ ఉన్న ఇండియన్స్ వీళ్ళే

|
Google Oneindia TeluguNews

2020 సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ రెడీ అవుతున్నారు. 2021 సంవత్సరానికి స్వాగతం పలకడానికి దగ్గరగా ఉన్న సమయంలో 2020 వ సంవత్సరంలో జరిగిన అనేక సంఘటనలను, కీలకమైన అంశాలను మనం చేసుకునే పనిలో పడ్డాం. ఈ క్రమంలోనే 2020లో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన కొన్ని ప్రపంచ రికార్డులను ముఖ్యంగా భారతదేశంలోని వ్యక్తులు సృష్టించిన ప్రపంచ రికార్డులను గురించి మీకు అందిస్తోంది వన్ ఇండియా.

2020లో మరణించిన ప్రముఖులు: భారత మాజీ రాష్ట్రపతి, ఎస్పీ బాలుతో పాటు ఎందరో మహానుభావులు2020లో మరణించిన ప్రముఖులు: భారత మాజీ రాష్ట్రపతి, ఎస్పీ బాలుతో పాటు ఎందరో మహానుభావులు

 ప్రపంచంలోనే పొడవైన జుట్టు నీలాన్షి పటేల్ కు గిన్నిస్ బుక్ రికార్డ్

ప్రపంచంలోనే పొడవైన జుట్టు నీలాన్షి పటేల్ కు గిన్నిస్ బుక్ రికార్డ్

2020లో నెటిజన్లు ఆశ్చర్యపోయిన కొన్ని ప్రపంచ రికార్డుల విషయానికి వస్తే గుజరాత్ కు చెందిన 18 ఏళ్ల నీలాన్షి పటేల్ మూడోసారి గిన్నిస్ బుక్ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నా నీలాన్షి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న అమ్మాయిగా మరోసారి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. అంతకుముందు రెండేళ్ల క్రితం నవంబర్ 28న ఆమె పేరు మీద రికార్డ్ ఉంది. ఈ రెండేళ్లలో దానిని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. చివరికి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ మరో కొత్త రికార్డును సృష్టించింది నీలాన్షి పటేల్ . ఈ భూమిపై ఇప్పటివరకూ ఏ టీనేజర్‌కీ ఇంత పొడవైన జుట్టు లేదట. ఇక దీని పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీలాన్షి పటేల్ జుట్టు రెండు మీటర్లు లేదా 6 అడుగుల 6.7 అంగుళాల పొడవు.

రోలర్ స్కేట్ తో స్కిప్పింగ్ కు గిన్నిస్ బుక్ లో స్థానం

రోలర్ స్కేట్ తో స్కిప్పింగ్ కు గిన్నిస్ బుక్ లో స్థానం

ఢిల్లీకి చెందిన జోరావర్ సింగ్ రోలర్ స్కేట్ ను ధరించి స్కిప్పింగ్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. 2. 30 సెకన్లలో రోలర్ స్టేట్ ధరించి ఆయన ఇన్లైన్ స్కేట్లపై 147 స్కిప్‌లు చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేశారు. "జోరవర్ మొదట్లో హైస్కూల్‌లో డిస్కస్ త్రోయర్, కానీ భయంకరమైన గాయం తర్వాత దానిని వదులుకోవాల్సి వచ్చింది . తరువాత అతను జంప్ రోప్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడ్డాడు . అతను స్కిప్పింగ్ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాలని విపరీతంగా కష్టపడ్డారు. ఏళ్ల తరబడి సాధన చేశారు. చివరకు రోలర్ స్కేట్ ధరించి అత్యంత వేగంగా స్కిప్పింగ్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు జోరావర్ సింగ్.

 ది ఫర్ గాటన్ ఆర్మీ కి గిన్నిస్ బుక్ రికార్డ్

ది ఫర్ గాటన్ ఆర్మీ కి గిన్నిస్ బుక్ రికార్డ్

ప్రముఖ ఫిలింమేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ది ఫర్ గాటన్ ఆర్మీ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు వెలుగుచూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో వెయ్యి మంది గాయకులు వాయిద్యకారులు పాల్గొన్నారు. భారత సినిమా నటి సంగీత బ్యాండ్ లో నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమంగా నిలిచిన ది ఫర్గాటెన్ ఆర్మీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.

 కరీంనగర్ , విజయవాడ వ్యక్తులకు గిన్నిస్ బుక్ లో స్థానం

కరీంనగర్ , విజయవాడ వ్యక్తులకు గిన్నిస్ బుక్ లో స్థానం

కరీంనగర్ జిల్లాకు చెందిన రోలర్ స్కేటింగ్ సీనియర్ క్రీడాకారుడు, కోచ్ అయిన గట్టు అనిల్ కుమార్ లాంగెస్ట్ కాంగో స్కేటింగ్ కాంపిటీషన్లో 48 గంటలు స్కేటింగ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన విద్యార్థిని మల్లాది రాహత్ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది 8 గంటల పాటు 36 భారతీయ భాషలు 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడినందుకు మోస్ట్ లాంగ్వేజెస్ సాంగ్ ఇన్ కాన్సెర్ట్ క్రింద రాహత్ కు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది .

60 వేల తేనెటీగలను నాలుగు గంటల పాటు ముఖానికి పట్టించుకుని గిన్నిస్ రికార్డ్

60 వేల తేనెటీగలను నాలుగు గంటల పాటు ముఖానికి పట్టించుకుని గిన్నిస్ రికార్డ్

కేరళ కు చెందిన నేచర్ ఎంఎస్ గా పిలువబడే ఒక యువకుడు 60 వేల తేనెటీగలను నాలుగు గంటల పది నిమిషాల పాటు ముఖంపై ఉంచుకుని గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించారు. చిన్నప్పటి నుంచి తేనెటీగలను పెంచి వాటిని మచ్చిక చేసుకున్న క్రమంలోనే అది సాధ్యమైందని ఆ యువకుడు చెప్పారు. భారతదేశంలో పులుల గణన 2018 కూడా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. భారత పులుల గణన-2018 గిన్నిస్​ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సర్వే కోసం దేశ వ్యాప్తంగా అడవుల్లో ట్రాప్ కెమెరాలతో పెద్దపులులనూ 76000 ఫోటోలు తీయడం, వీటితో పాటు, అడవి పిల్లులు, చిరుత పులులు కు సంబంధించిన 51000 ఫోటోలను తీయడం కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వే గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.

 ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్ పెన్ను ., 12638 వజ్రాలు పొదిగిన రింగు.. గిన్నిస్ రికార్డ్ లు

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్ పెన్ను ., 12638 వజ్రాలు పొదిగిన రింగు.. గిన్నిస్ రికార్డ్ లు

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్ పెన్నును తయారు చేసిన యువకుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. కేరళకు చెందిన మహమ్మద్ దిలీఫ్ తన పేరుని రాసుకోవడం కోసం ఒక భారీ మార్కర్ పెన్నును తయారు చేసి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నాడు. దీపావళి సందర్భంగా అయోధ్యలో సరయు నది ఒడ్డున నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. దీప కాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగింది. హైదరాబాద్ కు చెందిన ఒక నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన హర్షిత్ బన్సాల్ అనే వ్యక్తి అంతకు ముందు ఉన్న రికార్డును బద్దలు కొడుతూ 12638 వజ్రాలు పొదిగిన రింగును తయారు చేసి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు.
ఇలా భారతదేశంలో చాలా మంది ఆశ్చర్యపరిచే ప్రతిభతో గిన్నిస్ బుక్ రికార్డ్స్ ను

English summary
As the start of a new year draws nearer, many are getting ready to bid farewell to 2020. If you’re someone who is currently recapping and reflecting on the happenings of the past year, here is a list that may make that task a little easier for you. these are some of the world records that wowed netizens in 2020. Reading about the titles may leave you in awe too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X