వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ బాధితురాలి అబార్షన్ కు కోర్టు 'నో'

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : 14 ఏళ్ల ఓ రేప్ బాధితురాలి కడుపులో పెరుగుతోన్న పిండాన్ని తొలగించడానికి నిరాకరించింది గుజరాత్ హైకోర్టు. సోమవారం నాడు ఈ కేసు విచారణకు రాగా కోర్టు ఇలా స్పందించింది. ప్రస్తుతం బాలిక 28 నెలల కడుపుతో ఉండడంతో.. ఈ దశలో పిండాన్ని తొలగించడం బాలిక ప్రాణానికే ప్రమాదమని పేర్కొన్న కోర్టు అందుకు నిరాకరించింది.

బాలిక ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కోర్టుకు సమర్పించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి సోనియా గోకాని.. 28 నెలల కడుపుతో ఉన్న బాలికకు అబార్షన్ చేయడం సరికాదన్నారు. బాధిత బాలిక మరియు ఆమెకు పుట్టబోయే బిడ్డ సంరక్షణ కోసం.. బాలిక నివాసముండే దొరాజీ జిల్లా ప్రాంతంలోనే ఏదైనా ఎన్జీవో సంరక్షణ కేంద్రాలు ఉంటే.. ఆ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది.

Gujarat: 14-yr-old rape victim denied permission to abort 28-week foetus

సెప్టెంబర్ 14 లోపు ఏవైనా ఎన్జీవో సంరక్షణ కేంద్రాలు లేక అనాథ శరణాలయాలు లేక ఇతరత్రా వాటి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాల్సిందిగా జస్టిస్ సోనియా గోకాని ఆదేశాలు జారీ చేశారు. అప్పటిదాకా బాలికను ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాల్సిందిగా పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం 24 నెలల గర్బంతో ఉన్న బాలిక.. ఏడు నెలల కిందట తన స్నేహితుడి తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం అగస్టు 1వ తేదీన సదరు నిందితుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగానే బాలికకు అబార్షన్ చేయించేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే పిండాన్ని తొలగించడం ఆమెపై శారీరకంగా మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు పేర్కొనడంతో.. కోర్టు కూడా వైద్యుల నివేదిక మేరకే పిండాన్ని తొలగించడం కుదరదని, ఇది బాలిక ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని తెలిపింది.

English summary
The Gujarat High Court on Monday denied permission for termination of pregnancy of a 14-year-old rape survivor, citing medical reports which said the
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X