
లెక్క బరాబర్- ముఖ్యమంత్రి రాజీనామా ..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి చుక్కెదురైంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరిన కమలనాథులకు ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా ఇక్కడ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేసులో ఉండే నాయకుల పేర్లు కూడా అప్పుడే చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి కూడా.
అసెంబ్లీ
ఫలితాలపై
మూడు
రోజుల
కిందటే..!!
గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ జోరుకు హిమాచల్ ప్రదేశ్‌లో బ్రేకులు పడ్డాయి. ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉన్న మొత్తం స్థానాల సంఖ్య.. 68. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 35 సీట్లు. ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది కాంగ్రెస్. 40 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. వాటిల్లో పలుచోట్ల విజయం సాధించారు. మరిన్ని సీట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఈ పరిణామాల మధ్య బీజేపీ నాయకులు తమ ఓటమికి అంగీకరించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని స్పష్టం చేశారు. పొరపాట్లు ఎక్కడ చోటు చేసుకున్నాయో ఆరా తీస్తామని, దీనిపై చర్చించడానికి త్వరలోనే రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అధికార పార్టీపై నిరంతరాయంగా ఒత్తిళ్లను తీసుకొస్తామని జైరామ్ ఠాకూర్ చెప్పారు.

కాగా కొద్దిసేపటి కిందటే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అందజేశారు. సిమ్లాలోని తన అధికారిక నివాసం నుంచి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే సమయంలో గుజరాత్లో భూపంద్ర పటేల్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ నెల 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.