వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ డెడ్ లైన్, మాదారి మేము చూసుకుంటాం !

గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీకి అర్దరాత్రి డెడ్ లైన్ 30 సీట్లు కావాలంటున్న హార్దిక్ పటేల్, ఆలోచిస్తున్న కాంగ్రెస్బీజేపీ 15 సీట్లు ఇచ్చింది, హార్దిక్ కోసం అంత సాహసం చెయ్యాలా ?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ లోని పటీదార్‌ ఉద్యమనేత హార్థిక్‌ పటేల్‌ మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి డెడ్ లైన్ పెట్టారు. శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని హార్దిక్ పటేల్ తేల్చి చెప్పారు. పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పటేల్ వర్గం డిమాండ్లను ఒప్పుకోవాలని హార్థిక్‌ పటేల్ కు చెందిన పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌ పార్టీ మీద ఒత్తిడి తీసువచ్చింది. గుజరాత్ లో డిసెంబర్ లో జరుగుతున్నశాసన సభ ఎన్నికల్లో పటీదార్ వర్గానికి 30 సీట్లు ఇవ్వాలని హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు.

Gujarat Assembly elections 2017: Hardic Patel sets tonight’s deadine Congress over seats

ఇప్పటికే బీజేపీ నాయకులు పటీదార్ వర్గానకి 15 సీట్లు కేటాయించడంతో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మీద మరింత ఒత్తిడి తీసుకువస్తున్నారు. 30 సీట్ల కంటే తక్కవ సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని హార్దిక్ పటేల్ అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం హార్దిక్ మద్దతు కోసం అన్ని సీట్లు ఇవ్వడమంటే చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. సీట్ల కేటాయించే విషయంలో చర్చించేందుకు హార్థిక్‌ మద్దతుదారులను కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు.

ఈ చర్చల నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన పటీదార్‌ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్‌ దినేశ్‌బంభానియా మీడియాతో మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్‌కు తమ మద్దతు అవసరం లేదని మేము భావించాల్సి ఉంటుదని దినేష్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వైఖరిని బట్టి తమ భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని దినేష్ మీడియాకు చెప్పారు.

English summary
Hardik Patel has given a fresh deadline of midnight tonight for the Congress leadership to decide on his demands for a separate quota for Patidars in Gujarat and a list of candidates on about 30 Assembly seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X