వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి కల నెరవేరింది: పుట్టిన రెండు గంటల్లోనే చిన్నారికి ఏమి వచ్చాయో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

బిడ్డ జన్మించిన 1.48 నిమిషాల్లోనే ఆదార్ కార్డు కోసం పేరు నమోదు చేయించి ఏప్రిల్‌లో రికార్డు సృష్టించారు మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు . ఆ ఘటన మరువక ముందే గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ పుట్టిన రెండు గంటలకే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్ కార్డు ఇలా అన్నిటిని పొంది సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అంకిత్, నాగరాణి దంపతులు నివసిస్తున్నారు. నాగరాణి గర్భం దాల్చినప్పటి నుంచే పుట్టబోయే బిడ్డకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగస్వామిని చేయాలని భావించారు. ఇందుకోసం వారు చాలా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ఇక నెలలు నిండి నాగరాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపాప పేరు కూడా రమైయా అని పెట్టాలని ముందే అనుకున్నారు. ఇక రమైయా పుట్టిన రెండు గంటలకే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు లభించాయి. దీంతో రమైయా పుట్టిన రెండు గంటల్లోనే డిజిటల్ పద్ధతుల ద్వారా అన్ని డాక్యుమెంట్లు పొందిన చిన్నారిగా సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని సూరత్‌లో డిసెంబర్ 12న రమైయా జన్మించింది.

Gujarat baby girl gets enrolled for aadhaar,within 2 Hours of birth

అధికారుల సహకారంతో తన బిడ్డకు పుట్టగానే అన్ని డాక్యుమెంట్లు పొందాలన్న కల సాకారమైందని చిన్నారి తండ్రి అంకిత్ తెలిపారు. అంతేకాదు పుట్టినప్పటి నుంచే తాను డిజిటల్ ఇండియాలో భాగస్వామి అయినందుకు గర్వంగా భావిస్తుందని తండ్రి అంకిత్ తెలిపారు. అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు ముందుగా జన్మ ధృవపత్రాన్ని తయారు చేయించారు. దాని తర్వాత అన్ని డాక్యుమెంట్లు త్వరతగతిన అధికారుల సహకారంతో పూర్తయినట్లు రమైయా తల్లి దండ్రులు చెప్పారు.

English summary
Within hours of her birth, baby Ramaiya had all her documents, from Aadhaar to passport, in place. It was the dream of this Surat girl’s father, Ankit Nagarani, to link his child to PM Modi’s digital India initiatives. With this, Ramaiya has become the youngest Indian enrolled for Aadhaar, ration card and passport, a dream that Nagarani had. Ramaiya was born on December 12 in Gujarat’s Surat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X