• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వేదికపై కుప్పకూలిన సీఎంకు కరోనా పాజిటివ్ -స్థానిక ఎన్నికల్లో కొవిడ్ రూల్స్ పాటించని రూపానీ

|

అది గుజరాత్‌లోనే మూడో అతిపెద్ద నగరం.. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బీజేపీ ఇచ్చిన పిలుపుతో బహిరంగ సభకు భారీగా కదిలొచ్చిన జనం.. కార్యకర్తలు, అభిమానుల కేరింతలు చూసి.. వేదికపైనున్న ముఖ్యమంత్రికీ జోష్‌ వచ్చింది.. స్వతహాగా సంగీతకారుడైన ఆయన.. వెంత తెచ్చుకున్న వేణువు(ఫ్లూట్)ను బయటికి తీశారు.. ఉత్సాహంగా చక్కటి రాగమెత్తుకున్నారు.. రెండు నిమిషాలు వాయించారో లేదో.. మనిషి ఆసాంతం తూలిపడిపోబోయారు.. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు ఒడిసిపట్టుకునేలోపే ముఖ్యమంత్రి కుప్పకూలిపోయారు..

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా 'టూల్ కిట్' కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?

ప్రధాని మోదీ ఆరా..

ప్రధాని మోదీ ఆరా..

గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదర జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్పృహతప్పి పడిపోవడం అందరికీ షాక్ కు గురిచేసింది. 64 ఏళ్ల రూపానీకి ఏమైందంటూ సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. సభా వేదికపైనే సీఎం కుప్పకూలారన్న సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి, ఆరా తీశారు. అస్వస్థతకు కారణమేంటో తెలిసేలా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆ మేరకు..

సీఎంకు కరోనా పాజిటివ్

సీఎంకు కరోనా పాజిటివ్

వడోదర సిటీలోని నిజాంపురా ఏరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో స్పృహతప్పి పడిపోయిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీని హుటాహుటిన అహ్మదాబాద్ తరలించి, యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని రకాల టెస్టుల్లో భాగంగానే కొవిడ్-19 టెస్టు కూడా నిర్వహించగా.. రూపానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి, అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. సీఎంతోపాటు సభావేదికను పంచుకున్న నేతలంతా ఇప్పుడు టెస్టుల కోసం క్యూ కట్టారు. కాగా,

వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం

స్థానిక ఎన్నికల్లో హోరాహోరీ

స్థానిక ఎన్నికల్లో హోరాహోరీ

ధనిక రాష్ట్రం గుజరాత్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న, మొత్తం 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయితీలు, 231 తాలూకా పంచాయితీలకు ఈనెల 28న పోలింగ్ జరుగనుంది. బీజేపీ, కాంగ్రెస్ లతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగుతుండటంతో పోరు రసవత్తరంగా మారింది. కాగా, ఎన్నికల సమయంలో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిందేనని, బహిరంగ సభల నిర్వహణలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఏ ఒక్క పార్టీ కూడా వాటిని అమలు చేయడంలేదు. స్వయంగా ముఖ్యమంత్రి రూపానీనే కొవిడ్ రూల్స్ పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా,

గుజరాత్‌లో కరోనా ఉధృతి

గుజరాత్‌లో కరోనా ఉధృతి

కరోనా మహమ్మారికి సంబంధించి తొలి నాళ్లలో మరణాల రేటు తీవ్రంగా ఉన్న గుజరాత్ లో ఇప్పటికీ వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే కొత్తగా 247 పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,65,244కు, మరణాల సంఖ్య 4,401కి పెరిగాయి. ప్రస్తుతం 1739 యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 26మంది వెలంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. గుజరాత్ లో ఇప్పటి వరకు 7,91,602 మంది కరోనా వ్యాక్సిన్లు పొందారు.

English summary
Gujarat Chief Minister Vijay Rupani has tested positive for Covid 19 today morning, a day after he collapsed on stage while addressing a rally for upcoming civic polls in the Nizampura area of Vadodara. Rupani has been admitted to the hospital. On Sunday, he was taken to UN Mehta hospital, Ahmedabad, where he was kept under observation for 24 hours. Later, the doctors stated his condition as stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X