వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus positive: సీఎంను కలిసిన ఎమ్మెల్యే, నేడు విజయ్ రుపానీకి పరీక్షలు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ సీఎం విజయ్ రుపానీ బుధవారం కరోనా వైరస్ పరీక్ష చేయించుకోనున్నారు. మంగళవారం తనను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలాకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. పరీక్ష చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వైరస్ సోకడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 Gujarat Congress MLA Tests COVID-19 After Meeting CM

జమాల్‌పూర్ ఎమ్మెల్యే ఇమ్రాన్.. గత కొద్దిరోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్ పరీక్ష కోసం తన రక్త నమూనాలను అందజేశారు. మంగళవారం సీఎం విజయ్ రుపానీని కలుసుకొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొన్నాడు. అతని రిపోర్ట్ రాగా.. అందులో కరోనా వైరస్ సోకినట్టు ఉంది. వెంటనే అతనిని గాంధీనగర్ ఎస్ వీ పీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

Recommended Video

Fake News Buster : 04 ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే AC లు పని చేస్తాయా ? ఇందులో నిజమెంత ?

ఎమ్మెల్యే ఇమ్రాన్.. ఎవరెవరిని ఎక్కడ కలిశాడో అనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. కానీ నిర్ధారించిన వారిని మాత్రం క్వారంటైన్‌లో పెడతామని అదికారులు పేర్కొన్నారు. సీఎంతో కలిసి ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్న వీడియోలో వారిద్దరూ మీటర్ దూరంలోనే ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిదని భావించి.. పరీక్ష చేయించుకోవాలని విజయ్ రుపానీ భావిస్తున్నారు. గుజరాత్‌లో మంగళవారం కరోనా వైరస్‌తో ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరింది. ఒక్కరోజే 33 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 650 చేరింది.

English summary
Gujarat legislator has tested positive for coronavirus hours after attending a meeting with Chief Minister Vijay Rupani sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X