వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్దిక్ పటేల్ ఒక ఫూల్: మూర్ఖులు మరి కొందరు మూర్ఖులకు హామీ ఇచ్చారు: డీసీఎం ఫైర్!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఉద్యమాన్ని పక్కన పెట్టిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ హామీని నెత్తిన పెట్టుకున్నాడని, అతను ఒక మూర్ఖుడని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేట్ మండిపడ్డారు. కొందరు మూర్ఖులు మరి కొందరు మూర్ఖులకు హామీ ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఎద్దేవ చేశారు.

Recommended Video

Gujarat elections : Congress to give reservation to Patidars

పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కోటా కల్పిస్తామంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నితిన్ పటేట్ కొట్టిపారేశారు. పటేల్‌ సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్ లను కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించిందని హార్థిక్‌ పటేల్ చేసిన వ్యాఖ్యలపై నితిన్ పటేల్ ఈవిధంగా స్పందించారు.

 Gujarat DCM Nitin Patel calls Hardik Patel foolish accepting Congress proposal

పటేల్‌ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి రెండేళ్లుగా ఆందోళనలు నిర్వహించిందని నితిన్ పటేల్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన హార్దిక్ పటేల్ కు భగత్‌ సింగ్‌, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి పటేల్ సామాజిక వర్గం ఉద్యమాన్ని నాశనం చేస్తున్న హార్దిక్ పటేల్ కు త్వరలో ప్రజలే బుద్ది చెబుతారని నితిన్ పటేట్ జోస్యం చెప్పారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్ విమర్శలను హార్థిక్‌ పటేల్ ఖండించారు.

English summary
Gujarat Deputy Chief Minister Nitin Patel lashed out at Patidar leader Hardik Patel for accepting the Congress formula on job quotas and supporting it in upcoming Assembly elections, calling him a fool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X