వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్ధిక్‌కు షాకిచ్చిన బిజెపి: గుజరాత్‌లో కమలానికి కలిసొచ్చిన అంశాలివే

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్‌ రాష్ట్రంలో బిజెపిని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిన ముగ్గురు యువకులకు బిజెపికి అనుకూలమైన ఫలితాలు రావడంతో నిరాశే ఎదురైంది. పాటిదార్లు, దళితులు, ఓబిసిలు బిజెపిని ఇబ్బందులకు గురిచేసినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సామాజికవర్గాలు మూకుమ్మడిగా అధికార పార్టీకి ఓట్ల బదిలీ జరిగేలా ప్లాన్ చేయలేదు.

Recommended Video

Gujarat Election Result Update 2017 : Congress In Leading | Oneindia Telugu

2015 నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి మూడు కులాలకు చెందిన ఆందోళనలు. ఇందులో ప్రధానమైంది పటీదార్ల ఆందోళనలు. హర్దిక్ పటేల్ నేతృత్వంలో సాగిన పటీదార్ల ఆందోళనలు రాజకీయంగా బిజెపిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యమంత్రుల మార్పుకు కూడ ఈ ఉద్యమం కారణమైంది.

దళితులు, ఓబిసిల ఆందోళనలు కూడ బిజెపిని కొన్ని సమయాల్లో ఇబ్బందులకు గురిచేశాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమాలు ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వలేదు. దీనికి అనేక రకాల కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బిజెపికి కలిసివచ్చిన అంశాలు

బిజెపికి కలిసివచ్చిన అంశాలు

పటీదార్లతో పాటు ఓబిసి, దళితుల ఆందోళనలకు హర్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు ఏకీకృతంగా ఓట్లు బదిలీ కాలేదు.ఆయా సామాజికవర్గాల ఓట్లు మూకుమ్మడిగా ఓకే పార్టీకి బదిలీ అయితే ఆ పార్టీకి కలిసివచ్చేది. కానీ, అదే సమయంలో ఓట్ల చీలిక అధికార పార్టీకి కలిసివచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల వాదనగా ఉంది. ముగ్గురు నేతలు రాజకీయంగా బిజెపికి ఇరుకునపెట్టారు. కానీ, ఓట్లను బిజెపికి వ్యతిరేకంగా బదిలీ చేయడంలో సఫలీకృతం కాలేకపోయారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

 హర్దిక్ నుండి విడిపోయిన కీలక నేతలు

హర్దిక్ నుండి విడిపోయిన కీలక నేతలు

హర్ధిక్‌పటేల్ నేతృత్వంలో పటీదార్ల సమస్యలపై ఆందోళన సాగించిన సమయంలో ఆయనకు వెన్నంటి ఉన్న ఇద్దరు కీలక నేతలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరడం బిజెపికి కలిసివచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బిజెపి నేతల వ్యూహంలో హర్దిక్ పటేల్ ఇద్దరు సహచరులు బిజెపిలో చేరారు.

 సౌరాష్ట్రలో ప్రభావం చూపే లీవ్‌వా పటేల్

సౌరాష్ట్రలో ప్రభావం చూపే లీవ్‌వా పటేల్

పటీదార్లలో రెండు ఉప కులాలుంటాయి. వీరిలో లీవ్‌వా, కేద్‌వా. అయితే సౌరాష్ట్ర రీజియ‌న్‌లో లీవ్‌వా ఉపకులానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉంటారు. అంతేకాదు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఈ సామాజికవర్గానికి ఉంది.లీవ్‌వా ఉపకులానికి ఆధ్యాత్మిక ట్రస్ట్ పవర్‌పుల్. గుజరాత్ పటదార్ల కంటే ఈ ఉప కులం బలమెక్కువనే ప్రచారం కూడ ఉంది. అయితే బిజెపిని ఇరుకున పెట్టేందుకు లీవ్‌వా ఉప కులాన్ని కలిసిరావాలని హర్దిక్‌పటేల్ కోరారు. హర్దిక్ పటేల్ కేద్‌వా ఉప కులానికి చెందినవాడు.అయితే బిజెపికి పటీదార్లలో పాతరానికి చెందిన అలానే మద్దతుగా నిలిచారు. యూత్ మాత్రం హర్ధిక్ పటేల్ వైపుకు మొగ్గుచూపారు. ఇది కూడ బిజెపికి కలిసివచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 గుజరాత్‌లో 51 శాతం ఓబిసి ఓటర్లు

గుజరాత్‌లో 51 శాతం ఓబిసి ఓటర్లు

గుజరాత్ రాష్ట్రంలో 51 శాతం ఓబిసి ఓటర్లున్నారు. కోహ్లిలు ఓబిసి సామాజికవర్గంలో సుమారు 20 శాతం ఉంటారని అంచనా. పటీదార్లు సుమారు 12 శాతం మాత్రమే ఉంటారు.అయితే పటీదార్లలో రెండు ఉపకులాల మద్య చీలికను తీసుకువచ్చి లబ్దిపొందేందుకు బిజెపి ప్రయత్నం చేస్తోందని హర్దిక్ పటేల్ పలు సభల్లో ఆరోపణలు గుప్పించారు.

 మేహ్సనా జిల్లాలో బిజెపికి కలిసొచ్చింది

మేహ్సనా జిల్లాలో బిజెపికి కలిసొచ్చింది

మేహ్సనా జిల్లాలో బిజెపికి ఓబిసిల రూపంలో కలిసొచ్చింది. ఈ జిల్లాలో సుమారు 4 లక్షల పటీదార్లు ఠాకూర్ల ఓట్లున్నాయి.అయితే ఓబిసి సామాజిక వర్గంలో అత్యధికులు మేహ్సానా జిల్లాలో బిజెపి గెలుపుకు కృషి చేశారు.

English summary
Since 2015, Gujarat has seen the emergence of three "young turks" who are determined to upset the BJP apple cart in the state. Hardik Patel, Jignesh Mevani and Alpesh Thakor have tried to rally their respective communities — Patidars, Dalits and Other Backward Castes (OBCs)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X