వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్ చెప్పినా..: 'ఇది బీజేపీకి గెలుపే కాదు, మోడీ కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది'

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat election results : మోడీ కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఒకింత నిజమవుతున్నాయి. క్షణక్షణానికి ఫలితాలు తారుమారు అయిన ఫలితాలు.. చివరగా బీజేపీని ఆధిక్యంలో నిలబెట్టాయి. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి లీడింగ్ మారింది. చివరలో బీజేపీ కూడా గట్టి పోటీని ఇచ్చింది. బీజేపీ కీలక నేతలు వెనుకంజలో కనిపించారు. తర్వాత పుంజుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఓ సమయంలో వెనుకబడ్డారు.

 బీజేపీ సీట్లు తగ్గుదల, కాంగ్రెస్‌కు పెరిగే అవకాశం

బీజేపీ సీట్లు తగ్గుదల, కాంగ్రెస్‌కు పెరిగే అవకాశం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించింది. పది గంటలసమయంలో బీజేపీ 103 స్థానాల్లో, కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గతంలో కంటే బీజేపీకి పదిహేను సీట్లు తగ్గే అవకాశాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి పదిహేనుకు పైగా సీట్లు పెరిగేలా కనిపిస్తున్నాయి.

 ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగా

ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగా

చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 110 నుంచి 120 స్థానాల మధ్య గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 80 మధ్య సీట్లు వస్తాయని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ గెలుపు బీజేపీకి ఓ గెలుపు కాదని విశ్లేషకులు అంటున్నారు.

 ప్రధాని మోడీ తీరు మార్చుకోవాలి

ప్రధాని మోడీ తీరు మార్చుకోవాలి

కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చిందని, గుజరాత్‌లో గెలుపు ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఓ గెలుపు కాదని విపక్షాలు అంటున్నాయి. గుజరాత్ ఫలితాలతో ప్రధాని మోడీ తన తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. మోడీ కళ్లు తెరిచి పని చేయాలని అంటున్నారు.

 తేడా స్వల్పమే

తేడా స్వల్పమే

పది గంటల సమయానికి రెండు పార్టీల మధ్య తేడా చాలా స్వల్పంగానే ఉంది. బీజేపీ గెలిచినా తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

English summary
Gujarat Election Results Live Updates: It's results day for Gujarat today. Exit polls has given the BJP a clear advantage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X