వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ లో ఎవరికెన్ని? మొదటిసారి బీజేపీకి టెన్షన్ పట్టుకుందా!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Fresh Update On Gujarat Exit Polls : ఇండియా టుడే సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఇరవై రెండేళ్లుగా అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మొట్టమొదటిసారి టెన్షన్ పట్టుకుందా? అంటే అవుననే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా.. నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడ్డాయి.

పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న ఈ పడమటి రాష్ట్రంలో ఎన్నికల పోరు అత్యంత కీలకంగా మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ.. బస్తీమే సవాల్ అనుకుంటూ పల్లె, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

ఏడాది పొడవునా ఎన్నికలే...

ఏడాది పొడవునా ఎన్నికలే...

2017.. దేశంలో ఎన్నికలకే ఊపు తెచ్చిన సంవత్సరం. ఈ ఏడాదే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన అన్నిచోట్లా కమలనాథులు పాగా వేశారు. అయినా ఆ పార్టీ నాయకుల్లో ఏదో తెలియని టెన్షన్. కారణం ఏడాది చివర్లో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు రావడం. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కుడి ఎడమైతే ఎంత పరువు తక్కువ.

సర్వ శక్తులూ గుజరాత్‌పైనే...

సర్వ శక్తులూ గుజరాత్‌పైనే...


అందుకే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను కూడా పెద్దగా ఆ పార్టీ పట్టించుకోలేదు. సర్వ శక్తులూ గుజరాత్‌పైనే కేంద్రీకరించింది. గుజరాత్‌ను ఒక ఏలుడు ఏలిన నరేంద్ర మోడీ ఆ రాష్ట్రం నుంచి ప్రధానిగా ఎన్నికై కేంద్రానికి మారిన తరువాత తొలిసారిగా వచ్చిన ఎన్నికలివి. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకగా తీసుకుంది. 182 స్థానాల్లో 150 స్థానాలు తమవేనంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తాను వెళ్లిన చోటల్లా.. ఎన్నికలు జరగకముందే విక్టరీ సింబల్ చూపిస్తూ ఎన్నికలను మరింత వేడెక్కించారు.

మరింత పెరిగిన మోడీ బాధ్యత...

మరింత పెరిగిన మోడీ బాధ్యత...


దీనికితోడు మోడీని చూసి ఓటేయండంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడంతో ప్రధాని మోడీ బాధ్యతను మరింత పెరిగింది. దీంతో సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోడీ కూడా చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు ఎలాగైనా గుజరాత్‌లో మోడీని మట్టి కరిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ అహోరాత్రులు శ్రమించారు. గుజరాత్‌లో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా ఆయన కూడగట్టడంతో ఎన్నికలు మరింత రంజుగా మారాయి.

ఎగ్జిట్ పోల్స్‌తో టెన్షన్.. టెన్షన్

ఎగ్జిట్ పోల్స్‌తో టెన్షన్.. టెన్షన్


తొలివిడత, మలివిడత ప్రచారంలో చాలా తేడా కనిపించింది. తొలుత రెండు పార్టీలు గుజరాత్ అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. చర్చ కూడా అదే కోణంలో జరిగింది. అయితే రెండు వారాల్లోనే పరిస్థితి మారింది. ప్రచార పర్వంలో... కులం, మందిరం, మతం పాకిస్తాన్.. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా ఎన్నో అంశాలు వచ్చి చేరాయి. దీంతో అధికార బీజేపీలో టెన్షన్ మొదలైంది. మొత్తానికి ప్రచారం ముగిసింది. రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో మళ్లీ బీజేపీ అగ్రనాయకత్వానికి టెన్షన్ మొదలైంది. దీనికితోడు ప్రీపోల్ సర్వేల హడావుడి. మరి ఫలితాలు వెలువడే వరకు ఈ టెన్షన్ భరించక తప్పదేమో!

English summary
The Gujarat 2017 election, which is dominating national attention, is headed for a dramatic finish between the ruling BJP and the resurgent Congress.The last phase of elections in Gujarat came to an end on Thursday and the counting of polls will be held on December 18. In Gujarat, per the past 22 years BJP is in power. But for the first time now, the top leaders of this party are in full tension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X