వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి కోసం అత్యాధునిక లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్: ధరెంతో తెలుసా? ఏకధాటిగా 7000 కిలోమీటర్లు..!

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 191 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలు చేసింది. గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల పర్యటనల కోసం ఈ ప్రత్యేక తేలికపాటి విమానాన్నే వినియోగించాల్సి ఉంటుంది. బొంబార్డియర్ ఛాలెంజర్-650 రకానికి చెందిన ఈ విమానానికి రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒకేసారి మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఏకధాటిగా 7000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న విమానం ఇది. గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. మరో రెండు నెలల్లో ఇది గుజరాత్ ప్రభుత్వానికి అందనుంది.

TTD: బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు: జగన్ పై సంచలన వ్యాఖ్యలు..ఆయన కోసం ప్రార్థిస్తా..!TTD: బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు: జగన్ పై సంచలన వ్యాఖ్యలు..ఆయన కోసం ప్రార్థిస్తా..!

ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం వినియోగిస్తోన్న విమానం బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ రకానికి చెందినది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో దాన్ని కొనుగోలు చేశారు. సుమారు 20 ఏళ్లుగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆ విమానంలోనే అధికారిక పర్యటలను కొనసాగిస్తున్నారు. గంటకు 870 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న బీచ్ క్రాఫ్ట్ విమానం.. తరచూ సాంకేతిక మరమ్మతులకు గురవుతుండటం వల్ల కొత్త విమానాన్ని కొనుగోలు చేసింది గుజరాత్ ప్రభుత్వం. బొంబార్డియర్ సంస్థ దీన్ని తయారు చేసింది.

Gujarat government purchases aircraft worth Rs 191 crore for Chief Minister Vijay Rupani for official tour purpose

కొత్త విమానాన్ని కొనుగోలు చేయడానికి అయిదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని, అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని గుజరాత్ పౌర విమానయాన డైరెక్టర్ కేప్టెన్ చౌహాన్ తెలిపారు. మరో రెండు నెలల్లోగా బొంబార్డియర్ ఛాలెంజర్ తమ చేతికి అందుతుందని అన్నారు. కస్టమ్స్; పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి అనుమతులను తీసుకోవాల్సి ఉందని, ఆ తరువాతే విమానాన్ని తమకు అందిస్తారని అన్నారు. బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తో చాలాదూరం ప్రయాణించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొన్నిసార్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన సందర్భాలు సైతం ఎదురయ్యాయని అన్నారు.

English summary
The BJP government in Gujarat has finally purchased a new aircraft worth Rs 191 crore for use by Chief Minister Vijay Rupani and other dignitaries like Governor and deputy CM, formally wrapping up the delayed procurement process launched five years ago. The swanky two-engine 'Bombardier Challenger 650' would be delivered in the next two weeks, officials said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X