• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసు: కలకలం రేపుతున్న తాలిబన్,ఐఎస్ఐ లింకులు-వెలుగులోకి సంచలన విషయాలు

|

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3వేల కోట్లు ఉండొచ్చునని అదికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.అయితే ఆరు రోజుల విచారణ తర్వాత దాని విలువ అంతకు ఏడు రెట్లు... అంటే,రూ.21వేల కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు. అంతేకాదు,దీని వెనకాల తాలిబన్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం.. ఆర్థిక చేయూతకు ప్రపంచ దేశాలేవీ ముందుకు రాని పరిస్థితులు నెలకొనడంతో... తాలిబన్లు 'డ్రగ్స్' సప్లైనే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నట్లు డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజన్స అధికారులు అనుమానిస్తున్నారు.

ఆఫ్గనిస్తాన్ నుంచి గుజరాత్‌కు...

ఆఫ్గనిస్తాన్ నుంచి గుజరాత్‌కు...

ముంద్రా పోర్టుకు ఈ నెల 15న 2,988 కేజీల హెరాయిన్‌తో కూడిన రెండు కంటైనర్లు చేరుకున్నాయి.దీనిపై ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ ఇంటలిజెన్స్ టీమ్ ఆ పోర్టుకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న గూడ్స్‌ను తెరిచి చూడగా... అందులో ఉన్నది హెరాయిన్‌గా తేలింది. విజయవాడకు చెందిన ఆషీ కంపెనీ పేరు మీద కంటైనర్లలో ఈ గూడ్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌లో ఉన్న హాసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ నుంచి ఈ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.

తీవ్ర సంక్షోభంలో ఆఫ్గనిస్తాన్-ఆకలితో అలమటిస్తున్న జనం-తిండి కోసం అన్నీ అమ్మేసుకుంటున్నారుతీవ్ర సంక్షోభంలో ఆఫ్గనిస్తాన్-ఆకలితో అలమటిస్తున్న జనం-తిండి కోసం అన్నీ అమ్మేసుకుంటున్నారు

ఆర్థిక సంక్షోభం... తాలిబన్లకు ఆదాయమార్గంగా డ్రగ్స్...

ఆర్థిక సంక్షోభం... తాలిబన్లకు ఆదాయమార్గంగా డ్రగ్స్...

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... అప్ఘానిస్తాన్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు... అక్కడి నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఈ కంటైనర్లు చేరుకున్నాయి. ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో... డ్రగ్స్ రవాణానే ఏకైక ఆదాయ మార్గంగా తాలిబన్లు భావిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్‌కు ఈ డ్రగ్స్ చేరుకున్నట్లు భావిస్తున్నారు. నిజానికి గత ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వంలో డ్రగ్స్‌పై నిషేధం విధించారు.కానీ తాలిబన్ల రాజ్యస్థాపన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా వారి వద్ద నిధులు లేని దుస్థితి నెలకొంది.దీంతో డ్రగ్స్ రవాణానే ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.

భయపడినంతా జరుగుతోంది-ఆఫ్గన్ మహిళలపై తాలిబన్ సర్కార్ మరో పిడుగు-అణచివేతను మరింత తీవ్రం చేసేలాభయపడినంతా జరుగుతోంది-ఆఫ్గన్ మహిళలపై తాలిబన్ సర్కార్ మరో పిడుగు-అణచివేతను మరింత తీవ్రం చేసేలా

పాకిస్తాన్ ఐఎస్ఐ సాయంతో...

పాకిస్తాన్ ఐఎస్ఐ సాయంతో...

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ సాయంతో తాలిబన్లు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఆఫ్గన్ వ్యక్తులను ఢిల్లీ,ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.ఐఎస్ఐతో పరోక్ష సంబంధం ఉన్నట్లు విచారణలో ఆ వ్యక్తులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్తాన్ నుంచి ఆ గూడ్స్‌ను ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన జంటను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఆషీ కంపెనీ వీరికి చెందినదే. కంపెనీ చిరునామా విజయవాడ పేరిట ఉండగా... దాని కార్యకలాపాలు మాత్రం చెన్నై నుంచే జరుగుతున్నాయి. అరెస్ట్ అనంతరం ఈ జంటను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 10 రోజుల కస్టడీకి అప్పగించింది.

కొనసాగుతున్న తనిఖీలు...

కొనసాగుతున్న తనిఖీలు...


ఈ కేసుకు సంబంధించి ముంబైలోనూ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో ఇద్దరు ఆఫ్గనిస్తాన్‌కు చెందినవారిగా సమాచారం. ప్రస్తుతం అహ్మదాబాద్‌,చెన్నై,హైదరాబాద్,ముంబై,విజయవాడ,ఢిల్లీ తదితర ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నవారందరినీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ విలువను ఇప్పటికీ కచ్చితత్వంతో తేల్చలేకపోయామని అధికారులు వెల్లడించారు.దానికి మరికొంత సమయం పడుతుందన్నారు. టాల్కమ్ పౌడర్ నుంచి హెరాయిన్‌ను వేరు చేసి... దాని విలువపై ఒక అంచనాకు రాగా దాదాపు రూ.21వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తేలిందన్నారు.

తొలి నుంచి డ్రగ్స్ రవాణా పైనే...

తొలి నుంచి డ్రగ్స్ రవాణా పైనే...

తాలిబన్లకు డ్రగ్స్ రవాణాయే తొలి నుంచి ఆదాయమార్గంగా ఉన్నది.ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తున ఆఫ్గనిస్తాన్‌లో ఓపియం ఉత్పత్తి అవుతోంది.ఈ పంట నుంచే హెరాయిన్‌ను తయారుచేస్తారు.దీన్ని పండించేవారి నుంచి,దీన్ని హెరాయిన్‌గా మార్చే ల్యాబోరేటరీల నుంచి,అలాగే ట్రేడర్స్‌ నుంచి తాలిబన్లు పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తారు. తాలిబన్ల మొత్తం ఆదాయంలో కేవలం డ్రగ్స్ సప్లై ద్వారానే 60శాతం ఆదాయం సమకూరుతోంది.ఇటీవల ఆఫ్గనిస్తాన్‌లో ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు... తాము డ్రగ్స్ జోలికి వెళ్లదలుచుకోలేదని ప్రకటించారు.కానీ మిగతా హామీల్లాగే ఇదీ వట్టిదేనని తేలిపోయింది.

నిలిచిపోయిన నిధులు.. సంక్షోభంలో ఆఫ్గన్...

నిలిచిపోయిన నిధులు.. సంక్షోభంలో ఆఫ్గన్...

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. అందుకే ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల నుంచి కేవలం 200డాలర్లను విత్‌డ్రా లిమిట్‌గా విధించింది.ఇప్పటికే పలు బ్యాంకులు మూతపడ్డాయి.ఆఫ్గన్ ప్రజలు ఉద్యోగ,ఉపాధి లేక,తినడానికి తిండి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆఫ్గన్ సంక్షోభ నివారణకు 1బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఐరాస ప్రకటించింది.తాలిబన్ల ఆశలన్నీ ఇప్పుడా నిధుల పైనే ఉన్నాయి. ఆ నిధులు తమకు అందితే పేద ఆఫ్గన్ ప్రజలను ఆదుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు.ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుతో పాటు ఐడీబీ నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బ్యాంకులు తాలిబన్లకు నిధులు ఇవ్వడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ డ్రగ్స్ రవాణాను తాలిబన్లు తమ ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

English summary
New things are coming to light regarding the large scale drug seizure at Mundra port in Gujarat. Officials initially estimated the value of the seized drugs at Rs 3,000 crore. Moreover, it has been identified that there is a Taliban hand behind this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X