వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ మున్సిపోల్స్: బీజేపీ అధికస్థానాల్లో గెలిచినా...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తలపిస్తున్నాయి. గత డిసెంబరులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ, వరుసగా ఆరోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతమైంది. బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోగా, కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 16, స్వతంత్రులు 4, ఎన్సీపీ, బీఎస్పీలు చెరొకటి గెలుచుకున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరేశ్ సిన్హా తెలిపారు.

bjp-congress-symbols

ఆరు చోట్ల మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 మున్సిపాల్టీల్లో జయకేతనం ఎగురేసిన బీజేపీ ప్రస్తుతం 47కు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ తన స్థానాలను 13 నుంచి 16కు పెంచుకోగలిగింది.

గుజరాత్‌లోని 182 శాసనసభ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించగా, బీజేపీ 99, కాంగ్రెస్ 77 చోట్ల గెలుపొందాయి. బొటాబొటి మెజార్టీతో అధికారం హస్తగతం చేసుకున్న బీజేపీకి, ఈ విజయంతో చావుతప్పి కన్నులొట్టబోయింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది.

150 స్థానాలను టార్గెట్ చేసుకున్న బీజేపీకి మాత్రం భంగపాటు తప్పలేదు. 75 మున్సిపాల్టీలు, రెండు జిల్లా పరిషత్‌లు, 17 తాలూకాలు, 1400 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరి 17న పోలింగ్ నిర్వహించారు.

English summary
The BJP repeated its winning performance in the municipal polls in Gujarat, maintaining the same tally of seats this time around.The party won in 47 of 75 municipalities this time - the same number it had won last time.The Congress, however, improved its tally from the 2013 elections to 16 wins this time. It had won 13 municipalities in the last election. "In today's 75 municipalities elections results, BJP has won 47, Congress has won 16, NCP 1 and BSP 1, (in) 6 no one got majority and independents got 4," said the state's election commissioner Varesh Sinha. Late last year, the BJP had registered a victory in the Gujarat Assembly elections with 99 seats - but far lower than the 150-plus seats it had hoped for. On the other hand, the Congress bettered its tally by securing 77 seats in the Assembly. The local body polls in the state were held on February 17 for the municipalities, two district panchayats, 17 talukas and 1400 village panchayats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X