దేవాలయం నిర్మాణం: మూడు గంటల్లో రూ. 150 కోట్లు విరాళం, నిమిషానికి రూ. 84 లక్షలు !
అహమ్మదాబాద్: దేవాలయం నిర్మాణం కోసం ఓ వర్గం చేపట్టిన విరాళాల సేకరణకు (చందాల వసూలు) విపరీతమైన స్పందన వచ్చింది. మూడు గంటల వ్యవదిలో ఏకంగా రూ. 150 కోట్ల విరాళాలు గుజరాత్ లోని పాటిదార్ (పటేల్) వర్గం వారు ఇచ్చి రికార్డు సృష్టించారు. నిమిషానికి సరాసరి రూ. 84 లక్షల విరాళాలు వసూలు కావడం విశేషం.
గుజరాత్ లో పాటిదార్ (పటేల్) వర్గం వారి కులదైవం అయిన ఊమియా మాత దేవాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఏడు సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మంగల్ పటేల్, నెరన్ పటేల్ అనే సోదరులు గోరేగాంవ్ ప్రాంతంలో 40 ఏకరాల భూమిని దేవాలయం నిర్మాణం కోసం ఇచ్చారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంగల్ పటేల్, నెరన్ పటేల్ ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు విశ్వ్ ఊమియా పౌండేషన్ (VUF)ప్రారంభించారు. ముంబైకి చెందిన ఒకేఒక్క పటేల్ కుటుంబం రూ. 51 కోట్లు దేవాలయం నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది.
40 ఏకరాల స్థలంలో ఊమియా మాత దేవాలయం, ఆరోగ్య చికిత్స కేంద్రం, క్రీడా, సాంసృతిక కట్టడం, పాటేల్ వర్గానికి చెందిన బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్స్, ఉన్నత శిక్షణా కేంద్రం (స్కూల్, కాలేజ్) నిర్మించాలని నిర్ణయించారు.
రూ. 1,000 కోట్ల వ్యయంతో 2024 నాటికి దేవాలయం, అన్ని కట్టడాలు నిర్మించాలని తీర్మానించారు. ఇప్పటి వరకూ రూ. 100 కోట్లు విరాళం వచ్చింది. అయితే ఆదివారం జరిగిన దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పటేల్ వర్గీయులు మూడు గంటల్లో ఏకంగా రూ. 150 కోట్లు విరాళాలు ఇచ్చి రికార్డు సృష్టించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!