వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటి ఘటనను మరిచిన 'గోద్రా', ఐనా బీజేపీకి ఎదురుగాలి: ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గోద్రా ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ నుంచి దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. గత కొద్ది కాలంగా ఇక్కడ ఎలాంటి మార్పులు కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి. అభివృద్ధికి దూరంగా ఉందని అంటారు.

Recommended Video

దేశంలోనే తొలి సారి సముద్ర విమానంలో! మోడీ వ్యంగ్యాస్త్రాలు

మోడీ! మీ ఎన్నికల గోలలోకి మమ్మల్ని లాగకండి: గుజరాత్ ఎన్నికలపై పాకిస్తాన్ కౌంటర్మోడీ! మీ ఎన్నికల గోలలోకి మమ్మల్ని లాగకండి: గుజరాత్ ఎన్నికలపై పాకిస్తాన్ కౌంటర్

2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న వారిలో 51 మంది సజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత అహ్మదాబాద్, గుజరాత్‌లలోని పలు నగరాల్లో జరిగిన మత కల్లోహాల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ ఘటన జరిగి పదిహేనేళ్లవుతోంది.

 బీజేపీకి తిరుగు లేదు కానీ

బీజేపీకి తిరుగు లేదు కానీ

గుజరాత్‌లో గత రెండు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగు లేదు. 2002 నుంచి మోడీ నేతృత్వంలో కమలం పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసంది. గోద్రాలో మాత్రం గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ అత్యధికులు ముస్లీంలు. ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెబుతున్నారు.

 గోద్రోలో బీజేపీకి వ్యతిరేకంగా గళం

గోద్రోలో బీజేపీకి వ్యతిరేకంగా గళం

గోద్రా పంచమహల్ లోకసభ నియోజకవర్గ పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. షెర్వా, మోర్వా, హడఫ్, గోద్రా, కలోల్, హలోల్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని అంటున్నారు.

 ఆ ప్రభావం వల్లే

ఆ ప్రభావం వల్లే

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, వేల మంది రోడ్లపైకి వచ్చారనే విమర్శలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా, గోద్రా, తదనంతర ఘటనలను తాము మరిచిపోయామని, ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు.

 గోద్రా చూసేది ఇవే

గోద్రా చూసేది ఇవే

అయితే జీఎస్టీ, నోట్ల రద్దు తర్వాత ప్రభావంతో ఇక్కడి వారు ఇబ్బందులకు గురవడంతో మరోసారి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు. మరోవైపు, గోద్రాలోని వారు ఇప్పుడు ఉద్యోగాలు, విద్యుత్ అంశాలు, అభివృద్ధిని చూసి ఓటు వేయనున్నారని అంటున్నారు. అయితే ముఖ్య నేతలు మాత్రం ఈసారి గోద్రా గురించి మాట్లాడటం లేదు.

English summary
Fifteen years later, Godhra is all ready to bury the past and talk about the future. Few here want to relive the images of violence in the Gujarat town that triggered riots in the state in 2002.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X