వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామీ నిత్యానంద జంప్ .. దేశం విడిచి పారిపోయారని గుజరాత్ పోలీసుల అనుమానం

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యానంద స్వామిపై మరోమారు క్రిమినల్ కేసు నమోదు కావడంతో స్వామి నిత్యానంద జంప్ అయ్యారా అన్న సందేహం కలుగుతోంది. దేశం విడిచి నిత్యానంద పారిపోయాడు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న గుజరాత్ పోలీసులు ఇప్పుడు ఆయన కోసం గాలిస్తున్నారు.

నిత్యానంద ఆశ్రమంలో బందీలుగా విద్యార్థినులు: విడిపించాలంటూ హైకోర్టులో పిటీషన్..!నిత్యానంద ఆశ్రమంలో బందీలుగా విద్యార్థినులు: విడిపించాలంటూ హైకోర్టులో పిటీషన్..!

 వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై క్రిమినల్ కేసు నమోదు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై క్రిమినల్ కేసు నమోదు

నిత్యానంద ఆశ్రమంలో మైనర్ బాలికలను బంధించారని ఇద్దరు బాలికల తల్లిదండ్రులు నిత్యానంద ఆశ్రమం పై ఫిర్యాదు చేయగా పోలీసులు గుజరాత్ హీరాపూర్ ఆశ్రమంలో ఉన్న మైనర్ బాలికలకు విముక్తి కల్పించారు. ఇక తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపధ్యంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు.

జనార్ధన శర్మ తన కుమార్తెల కోసం చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

జనార్ధన శర్మ తన కుమార్తెల కోసం చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

స్థానికుడైన జనార్ధనశర్మ దంపతులు నిత్యానంద ఆశ్రమంలో ఉన్న తన ఇద్దరు కుమార్తెలు కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఇంటికి రావడానికి నిరాకరించారు. దీంతో పోలీసుల సాయంలో శర్మ సర్వజ్ఞపీఠానికి వెళ్లగా..ఆయన ఇద్దరు కూతుళ్లు ఇంటికి వచ్చేది లేదని తల్లిదండ్రులకు తేల్చి చెప్పారు. దీంతో జనార్ధనశర్మ తన కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కంప్లైంట్‌ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

నిత్యానందకు చెందిన సర్వజ్ఞ ఆశ్రమంలో నిర్బంధంలో బాలికలు

నిత్యానందకు చెందిన సర్వజ్ఞ ఆశ్రమంలో నిర్బంధంలో బాలికలు


జనార్దన శర్మ కుమార్తెలను విముక్తులను చేయడం కోసం ఆశ్రమానికి వెళ్లిన పోలీసులు ఆశ్రమంలో చేరిన తొమ్మిది నుండి పది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు తమని హింసించారని పనిచేయాలని పది రోజులకు పైగా నగరం లో ఒక ఫ్లాట్ లో అక్రమంగా నిర్బంధంలో ఉంచారని పోలీసులకు చెప్పారు. దీంతో నిత్యానంద ఆశ్రమంలో జరుగుతున్న దారుణాల ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. చిన్నారులకు బంధ విముక్తి

ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. చిన్నారులకు బంధ విముక్తి

మైనర్ బాలికలను అపహరించడం మరియు వారిని నిర్బంధించడం వంటి ఆరోపణలపై వివాదాస్పద గురువు నిత్యానందపై, ఆశ్రమ నిర్వాహకులు అయిన సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ లపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యోగిని సర్వజ్ఞ పీఠంలో ఉన్న బాలికలను విడిపించిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్, అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం అంటే ఆరోపణలతో మంగళవారం నిత్యానంద శిష్యులైన సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

 నిత్యానంద కోసం గాలింపు... దేశం విడిచి పారిపోయారని అనుమానిస్తున్న పోలీసులు

నిత్యానంద కోసం గాలింపు... దేశం విడిచి పారిపోయారని అనుమానిస్తున్న పోలీసులు

ఆశ్రమంలో తాము చూసిన పరిస్థితిని బట్టి ఇక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిత్యానందపైనా కేసు రిజిస్టర్ చేశారు.అహ్మదాబాద్ రూరల్ పోలీస్ సూపరిండెంట్ ఆర్ వి అసారి మాట్లాడుతూ నిత్యానంద విదేశాలకు పారిపోయారని, ఆయన ఎక్కడ ఉన్నా సరే గుజరాత్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుంటారని వివరించారు. కర్ణాటక రాష్ట్రంలో నిత్యానంద స్వామిపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ఆయన దేశం విడిచి పారిపోయారని, ఆయన ఇక్కడే ఉన్నాడు అని వెతకడం సమయం వృధా కావడం తప్ప, మరోటి కాదని ఎస్పి పేర్కొన్నారు.

Recommended Video

14 fake babas :There is no Swamy Nityananda Why నకిలీ బాబాల్లోస్వామి నిత్యానంద ఎందుకు లేడు?|Oneindia
 బిడిది ఆశ్రమంలో కనిపించని నిత్యానంద .. ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామన్న గుజరాత్ పోలీసులు

బిడిది ఆశ్రమంలో కనిపించని నిత్యానంద .. ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామన్న గుజరాత్ పోలీసులు

అవసరమైతే విదేశాలకు వెళ్లిన నిత్యానందను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన ఎస్పీ, ఆయన భారతదేశానికి తిరిగి వస్తే తప్పక అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు అయిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని విచారిస్తున్నారు. బెంగళూరు సిటీకి దగ్గర్లోని బిడిది ఆశ్రమంలోనూ నిత్యానంద కోసం గాలించారు. అయినప్పటికీ ఆయన జాడ కనిపించలేదు. చాలాకాలంగా నిత్యానంద బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించారని ఈ ఉదంతంతో బయటకు వచ్చింది. దీంతో పోలీసులు నిత్యానంద ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తామని చెబుతున్నారు.

English summary
Self-styled godman Swami Nithyananda, booked in a criminal case related to his ashram here, has fled the country, with the Gujarat police working to gather concrete evidence against him after taking two of his disciples in remand, officials said on Thursday.An FIR was registered on Wednesday against the controversial guru on the charges of kidnapping and wrongful confinement of children to make them collect donations from followers to run his ashram here, Yogini Sarvagyapeetham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X