వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్: రాజ్యసభకు అహ్మద్ పటేల్, నెక్ట్స్ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకొన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్ట చీఫ్ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. బిజెపి నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలు విజయం సాధించారు.

బిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీబిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీ

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయం నుండి కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియన్ నేత శంకర్‌సింగ్ వాఘేలా పార్టీని వీడారు. ఆయనతో పాటు 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అయితే బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామాట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామా

అయితే ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అయితే బిజెపి ఎత్తుగడలను పసిగడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహం ఎట్టకేలకు ఫలించింది.

ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

మరోవైపు మంగళవారం నాడు పోలింగ్ రోజున చోటుచేసుకొన్న పరిణామాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ వ్యూహత్మకంగా వ్యవహరించారు. ఒకానొక సందర్భంలో ఈ ఎన్నికను రద్దు చేయాలని కూడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది.

అహ్మద్‌ పటేల్ విజయం

అహ్మద్‌ పటేల్ విజయం

ఎఐసిసి చీఫ్ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభకు ఐదోసారి ఎన్నికయ్యారు. అయితే ఈ స్థానం నుండి అహ్మద్ పటేల్ ఎన్నిక కాకుండా బిజెపి చేసిన ఫ్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటుచేసుకొన్నాయని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. కాంగ్రెస్, బిజెపిలు ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకొన్నారు. అయితే ఎట్టకేలకు ఈ ఎన్నికలో అహ్మద్ పటేల్ విజయం సాధించారు. బిజెపి నుండి అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు.

Recommended Video

Rajya Sabha Elections : After Winning Ahmed Patel's next target is...
మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకొన్న అహ్మద్ పటేల్

మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకొన్న అహ్మద్ పటేల్


కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు చేశారు. .బోలాబాయ్ గోహిల్, రాఘవ్‌బాయ్ పటేల్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు కాకుండా బిజెపికి ఓటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఈ ఇద్దరి ఓట్లు చెల్లకుండా చేయాలని ఫిర్యాదు చేసింది. దీంతో కౌంటింగ్ నిలిపివేశారు. అధికారులు. మంగళవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రెండు ఓట్లు చెల్లుబాటు కావడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 176 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే ఇద్దరి ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు చేరుకొంది. 44 ఓట్లు వస్తే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవుతారు. అహ్మద్ పటేల్ కు 44 ఓట్లు దక్కడంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

నెక్ట్స్ టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే

నెక్ట్స్ టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే

ఈ విజయంతో అధికార బిజెపిపై దూకుడును పెంచారు అహ్మద్ పటేల్. తననను ఓడించేందుకుగాను బిజెపి అధికారబలాన్ని, డబ్బును ఉపయోగించిందని ఆయన ట్విట్టర్‌లో ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాను విజయం సాధించడం సాధారణ విజయం కాదన్నారు. సత్యమేవజయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన తదుపరి లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అంటూ ఆయనట్వీట్ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

అహ్మద్ పటేల్ ఓడించేందుకుగాను మూడో అభ్యర్థిని రంగంలోకి దించి బిజెపి అనేక పథకాలను రచించింది. అయితే బిజెపి ప్లాన్ సక్సెస్ కాలేదు. ఈ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించడం గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మానసిన స్థైర్యాన్ని ఇస్తోంది.. పటేల్ గెలిచిన వెంటనే బాణసంచా కాల్చుతూ , ర్యాలీలు నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు.

English summary
Senior Congress leader Ahmed Patel has been re-elected to the Rajya Sabha from Gujarat after a tense election, the Congress party has claimed. The Congress had approached the Election Commission seeking to invalidate the votes of its two legislators who voted for the BJP, which the EC agreed after reviewing the matter. Leaders of the ruling BJP also went to the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X