వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీ

గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటుచేసుకొన్న రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకొంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయంటూ ఎన్నికను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌ను క

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటుచేసుకొన్న రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకొంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయంటూ ఎన్నికను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌ను కొనసాగించాలని బిజెపి డిమాండ్ చేసింది.

ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా బ్యాలెట్ పేపర్లను తెచ్చి ఓట్లు వేశారని వారి ఓట్లను చెల్లనివిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

అయితే ఈ విషయమై కాంగ్రెస్, బిజెపిలు మూడు దఫాలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. తమ తమ వాదనలను విన్పించారు. అయితే ఈ వాదనలను విన్న తర్వాత మంగళవారం నాడు అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది.

ట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామాట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామా

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి ఓటు చేశారు. బోలాబాయ్ గోహిల్, రాఘవ్‌బాయ్ పటేల్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు కాకుండా బిజెపికి ఓటు చేశారు.

 Gujarat Rajya Sabha Election: Votes Of 2 Congress Legislators Declared Invalid

అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 176 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే ఇద్దరి ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు చేరుకొంది. 44 ఓట్లు వస్తే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవుతారు.

ఈసీ నిర్ణయంతో అహ్మద్‌పటేల్ మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలారు. అయితే ఈ నిర్ణయం బిజెపికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు.

English summary
Election Commission declared votes of Congress MLAs Bhola Bhai Gohil and Raghav Bhai Patel as invalid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X