వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ తీరే వేరు: వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.. వారంలో 79 మంది మృతి

స్వైన్‌ఫ్లూ వల్ల గుజరాత్‌లో ఈ ఏడాది ఇప్పటివరకూ 358 మంది చనిపోయారు. గత వారంలోనే హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకి ఆ రాష్ట్రంలో 79మంది మృతి చెందారు.హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కలిగిందే వ్యాధినే స్వైన్‌ఫ్లూగా చెబుతారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: స్వైన్‌ఫ్లూ వల్ల గుజరాత్‌లో ఈ ఏడాది ఇప్పటివరకూ 358 మంది చనిపోయారు. గత వారంలోనే హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకి ఆ రాష్ట్రంలో 79మంది మృతి చెందారు. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కలిగిందే వ్యాధినే స్వైన్‌ఫ్లూగా చెబుతారు. స్వైన్‌ఫ్లూ నివారణ కోసం టీకాలు వేయించాలని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సిఫారసు చేసినా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దాంతో, ఆ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టుగా పరిశీలకులు చెబుతున్నారు.

గత శుక్రవారం ఒక్కరోజే నలుగురు స్వైన్ ఫ్లూ జ్వరంతో మరణించారు. వారిలో అహ్మదాబాద్ నగర వాసులిద్దరు ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం కొత్తగా 172 స్వైన్ ప్లూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసులు 5220 కాగా, అహ్మదాబాద్ నగరంలో 42 కేసులు రికార్డయ్యాయి. కానీ కొత్తగా స్వైన్ ప్లూ కేసుల నమోదు తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

 ఐడీఎస్పీ అధికారుల సూచనలు బేఖాతర్ ఇలా

ఐడీఎస్పీ అధికారుల సూచనలు బేఖాతర్ ఇలా


హెచ్‌1ఎన్‌1 వ్పాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రంగా గుజరాత్‌ను ఈ ఏడాది మే నెలలో వ్యాధుల నిఘా సమగ్ర కార్యక్రమ (ఐడీఎస్‌పీ) సంస్థ గుర్తించింది. దేశంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటిగా ఐడీఎస్‌పీ తన నివేదికలో పేర్కొన్నది. అయినా, గుజరాత్‌ ప్రభుత్వం మాత్రం హెచ్చరికలను ఖాతరు చేయలేదు. ఆగస్టులోనే ఆకస్మికంగా ఈ వ్యాధి ప్రబలిందంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు సమర్థించుకుంటున్నారు.

హెచ్‌1ఎన్‌1కు అడ్డుకట్ట వేయడంలో టీకాలే మంచి ఫలితాలనిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో)తోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సిఫారసు చేశాయి. వ్యాధి నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కలిగిండం, లక్షణాలను గుర్తించి వ్యాధిని త్వరగా నిర్ధారించుకోవడం, వెంటనే చికిత్స అందించడంవంటి ప్రామాణికాలను కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యశాఖ 2015లో గర్భిణీలతోపాటు హెచ్‌1ఎన్‌1బారినపడే అనుమానిత వ్యక్తులకు కూడా టీకాలను సిఫారసు చేసింది. మథుమేహం, రక్తపోటు, శ్వాస సంబంధ దీర్ఘకాలిక సమస్యలున్న వ్యక్తులకు ఈ టీకాలను సిఫారసు చేసింది. గత అనుభవాలను క్రోడీకరించడం ద్వారా గత ఏప్రిల్‌లో ఆరోగ్యశాఖ మరికొన్ని మార్గదర్శకాలను సూచించింది. స్వైన్‌ఫ్లూ సోకినవారిలో మథుమేహం, రక్తపోటుతో బాధపడేవారు 50 శాతంమేర ఉన్నట్టు పరిశీలనలో వెల్లడైంది.

గర్భిణులు జాగ్రత్తలు వహించాలని సూచనలు

గర్భిణులు జాగ్రత్తలు వహించాలని సూచనలు

హెచ్‌1ఎన్‌1తో మృతి చెందుతున్నవారిలో ఎక్కువభాగం రక్తపోటు, మథుమేహం, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారేనని గుజరాత్‌ వైద్య అధికారి డాక్టర్ ఉమాంగ్‌మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన 329మందిని పరిశీలించగా, 57 శాతం మంది ఈ వ్యాధులతో బాధపడినవారేనని తేలింది. అయితే, గుజరాత్‌లోని వైద్య అధికారులు మాత్రం టీకాల విషయాన్ని పట్టించుకోవడంలేదు. ఈ కాలంలో దేశంలో స్వైన్‌ఫ్లూ సాధారణమేనని వారు చెబుతున్నారు. దీనిపై స్పందించిన జాతీయ రోగ నియంత్రణా సంస్థ డైరెక్టర్‌ డాక్టర్ ఏసి ధరీవాల్‌ మాత్రం హెచ్‌1ఎన్‌1ను నిరోధించేందుకు గుజరాత్‌లాంటి రాష్ట్రాలు మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు కూడా ఈ వ్యాది సోకే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుజరాత్‌లో వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలను పరిమితం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు గుజరాత్‌లో టీకాలు వేయడం ప్రారంభించినా ఫలితముండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌-జులై నెలల మధ్య టీకాలు వేయించి ఉంటే ఫలితముండేదని వారన్నారు.

గుజరాత్ తర్వాతీ స్థానంలో మహారాష్ట్ర

గుజరాత్ తర్వాతీ స్థానంలో మహారాష్ట్ర


స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో టీకాల వల్ల ప్రయోజనం ఉండదని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ లలిత్‌దార్‌ తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా గుజరాత్‌ ప్రభుత్వానికి సూచనలివ్వడం కోసం అక్కడికి వెళ్లిన కేంద్ర వైద్యుల బృందంలో దార్‌ కూడా ఉన్నారు. టీకాల వల్ల 70 నుంచి 80 శాతంమేర స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా రక్షణ ఉంటుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ చెబుతున్నది. టీకా పని చేస్తుంది.. కానీ,100 శాతం హామీ ఇవ్వలేమని ముంబయికి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ ఓంశ్రీవాస్తవ తెలిపారు.

అలా చేస్తే మంచి ఫలితమే..

అలా చేస్తే మంచి ఫలితమే..

వెంటనే చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితమిచ్చే మందులున్నాయని ఆయన చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోగా చికిత్స ప్రారంభిస్తే ఫలితముంటుందని వారు చెబుతున్నారు. జ్వరం,దగ్గు, గొంతులో తీవ్ర నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, వొంటి నొప్పులు ఈ వ్యాధి లక్షణాలని చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి అధికంగా ప్రభావితం చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. 30 వేల మందికి పైగా మహారాష్ట్ర వాసులు స్వైన్ ఫ్లూ వ్యాధి భారీన పడుతున్నారు. ఇదంతా సర్కారీ దవాఖానల్లో వాక్సినేషన్ చేయించుకున్న వారి లెక్కలు మాత్రమే. కానీ అనధికారికంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు వేయించుకునే వారు ఎక్కువగానే ఉంటారని అంచనా.

English summary
AHMEDABAD: Four persons died of swine flu in the Gujarat, including two in the city, taking the death toll due to H1N1 virus to 358 across the state this year. According to a state government statement, 172 new cases were reported in the state. This brings total number of swine flu cases to 5,220. In city, 42 new cases of swine flu were reported on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X