వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ క్లాసులు, హోం వర్క్ ప్రెషర్, ఎనిమిదో తరగతి విద్యార్థిని బలవన్మరణం, రూ.10 వేలతో

|
Google Oneindia TeluguNews

అసలే కడు పేదరికం.. ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ఆటో గ్యారేజ్ నడిపిస్తోన్న తండ్రి.. లాక్ డౌన్ సమయంలో బతుకుబండిని ఎలాగోలా లాగేశాడు. కానీ వైరస్ వ్యాపించడంతో.. స్కూళ్లను పరీక్షలను ముందే మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో చాలా స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కడు పేద అయిన ఆ తండ్రి కూతురి కోసం రూ.10 వేలతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు.

చంద్రబాబుకు ప్రధాని ఫోన్ - చైనా వివాదంపై సలహా కోరిన మోడీ ? - ఫేక్ ట్వీట్లపై బాబు అసహనం...చంద్రబాబుకు ప్రధాని ఫోన్ - చైనా వివాదంపై సలహా కోరిన మోడీ ? - ఫేక్ ట్వీట్లపై బాబు అసహనం...

నిరుపేద తండ్రి

నిరుపేద తండ్రి

గుజరాత్ రాజ్‌కోటకు చెందిన రోహిత్‌ నిరుపేద. ఇతనికి పెళ్లి కాగా.. కూతురు ఖుషీ, కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని సాగేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. అయితే ఖుషీ, ఆమె తమ్ముడు చదువుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల.. పరీక్షలు నిర్వహించకపోవడంతో ఖుషీ ఎనిమిదో తరగతికి ప్రమోట్ అయ్యింది. జూన్ మాసం ప్రారంభం కావడంతో స్కూల్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. వాస్తవానికి ఇంట్లో ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. కూతురి కోసం రూ.10 వేలతో రోహిత్ ఫోన్ కూడా కొనుగోలు చేశాడు.

క్లాసుల ఒత్తిడి

క్లాసుల ఒత్తిడి

ఆన్ లైన్ క్లాసులకు ఖుషీ హాజరవుతూనే ఉంది. టీచర్లు రోజు హోం వర్క్ ఇవ్వడంతో చేస్తుంది. కానీ సోమవారం క్లాసుల వల్ల చిన్నారి ఒత్తిడికి గురయ్యింది. స్కూల్ లేకున్నా క్లాసులు ఏంటి అని, స్నేహితులను కలువలేకపోతుందని మదనపడిపోయింది. ఇదే విషయంపై ఆలోచిస్తుంది. అయితే సోమవారం ఉదయం తల్లి హోం వర్క్ పూర్తిచేశావా అని అడిగితే.. మళ్లీ వస్తా అని గదిలోకి వెళ్లిపోయింది. క్లాసులు, హోం వర్క్ బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయింది.

మిన్నంటిన రోదనలు

మిన్నంటిన రోదనలు

కూతురు చనిపోవడంతో పేరంట్స్ రోదనలు మిన్నంటాయి. తినడానికి సరిగా తిండి లేకున్నా.. స్మార్ట్ ఫోన్ కొన్నచ్చామని గుర్తుచేస్తున్నారు. ఒత్తిడి భరించలేక చనిపోయిందని వాపోయారు. రోహిత్ కుటుంబం.. కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి అని బంధువు ఒకరు చెప్పారు. చదువుకొని మంచి స్థితికి వస్తుందని అనుకొన్న కూతురు.. చనిపోవడం వారికి గుండెకోత మిగిల్చింది.

English summary
school girl killed herself by suicide in Gujarat’s Rajkot after being frustrated with online classes and homework in the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X