వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భార్య దారుణ హత్య: భర్త కోసం ఎఫ్‌బీఐ వేట, పట్టిచ్చిన వారికి రూ. 70లక్షల రివార్డ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడి కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వేట కొనసాగిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారీలో ఉన్నాడు.

అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం.. ఏర్పాట్లు పూర్తి.. అక్రమ ఆయుధాలు, కోట్ల రూపాయలు సీజ్అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం.. ఏర్పాట్లు పూర్తి.. అక్రమ ఆయుధాలు, కోట్ల రూపాయలు సీజ్

ఒకే సంస్థలో పనిచేస్తూ..

ఒకే సంస్థలో పనిచేస్తూ..

ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. 24ఏళ్ల భద్రేశ్ కుమార్, అతని భార్య పాలక్(21) అమెరికాలో నివాసం ఉంటూ హనోవర్ మేరీల్యాండ్‌లోని డంకిన్ డోనట్ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్‌లో వీరిద్దరూ ఆ స్టోర్‌లో రాత్రిపూట విధులు నిర్వహించారు.

ఆ రాత్రే పాలక్ దారుణ హత్య..

ఆ రాత్రే పాలక్ దారుణ హత్య..

ఆ రాత్రే పాలక్ దారుణ హత్యకు గురైంది. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.. స్టోర్‌లోని సీసీఫుటేజీని పరిశీలించి దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏమి ఎరుగనట్లుగా..

ఏమి ఎరుగనట్లుగా..

హత్య జరిగిన రోజు రాత్రి భద్రేశ్ కుమార్ తన భార్యతో కలిసి స్టోర్ వంట గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా బయటికి వచ్చేశాడు భద్రేశ్ కుమార్. ఇదంతా సీసీ ఫుటేజీలో కనిపించింది. కాగా, స్టోర్ నుంచి ఇంటికి వెళ్లిన భద్రేశ్.. తన సామాన్లు తీసుకుని సమీప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి పరారైన భద్రేశ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.

రూ. 70 లక్షల రివార్డలు..

ఈ నేపథ్యంలో తమ చిక్కకుండా తిరుగుతున్న పది మంది నిందితుల్లో భద్రేశ్ కుమార్‌ని కూడా చేర్చింది ఎఫ్‌బీఐ. అతని కోసం అమెరికాతోపాటు భారతదేశంలోనూ తీవ్రంగా గాలిస్తోంది. అంతేగాక, భద్రేశ్ కుమార్‌ను పట్టి ఇచ్చిన వారికి లక్ష డాలర్లు(రూ. 70లక్షల నగదు) ఇస్తామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది.

English summary
Considered as one of the biggest ever simultaneous chases in the US and India, the Federal Bureau of Investigation (FBI) is hunting for an Indian fugitive, Bhadresh Kumar Patel, for the past four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X