• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...

|

కాంగ్రెస్ టాప్ లీడర్‌షిప్‌లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్‌ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగా బాధపెట్టి ఉండవచ్చు. ఒకప్పుడు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని తనను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పట్టుబట్టిన ఆజాద్... రాజీవ్ గాంధీ హయాం నుంచి ఇప్పటివరకూ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటూ వచ్చిన ఆజాద్.... ఇప్పుడు తన నాయకత్వాన్నే ధిక్కరిస్తూ తనకే లేఖ రాయడం ఆమెను బాధపెట్టే అంశమే.

సోనియా నాయకత్వం కోసం ఆజాద్...

సోనియా నాయకత్వం కోసం ఆజాద్...

1971లో జగ్జీవన్ రామ్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టేందుకు అంత సమర్థుడైన మరో గాంధీయేతర నాయకుడు పార్టీకి దొరకలేదు. 1977 ఎన్నికల్లో దేవకాంత్ బురాహ్,1996 ఎన్నికల్లో పీవీ నరసింహారావు,1998 ఎన్నికల్లో సీతారాం కేసరి నేత్రుత్వంలో ఎన్నికల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఓటమిపాలైంది. దీంతో తిరిగి గాంధీ కుటుంబమే పగ్గాలు చేపట్టాలన్న అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వ్యక్తమయ్యాయి. అయితే అప్పటికి సోనియా గాంధీ తప్ప మరో ఆప్షన్ లేదు. ఆమె కూడా రాజకీయాల పట్ల నిరాసక్తితో ఉన్నారు. ఆ సమయంలో గులాం నబీ ఆజాద్ ఆమె నాయకత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

రాజకీయాల్లోకి రావాలని పట్టుబట్టిన ఆజాద్...

రాజకీయాల్లోకి రావాలని పట్టుబట్టిన ఆజాద్...

'కళ్ల ముందే కాంగ్రెస్ పతనాన్ని మీరెలా చూస్తూ ఊరుకుంటారు..' అని గులాంనబీ ఆజాద్ నేత్రుత్వంలోని కొంతమంది నేతలు సోనియా నాయకత్వం కోసం పట్టుబట్టారు. రాజీవ్ హత్య కేసు విచారణ నత్త నడకన సాగుతుండటం,కాంగ్రెస్ క్షీణదశకు చేరుకుంటుండటం,నెహ్రూ-గాంధీ వారసత్వంపై దాడి... ఇవన్నీ సోనియా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరాన్ని కల్పించాయి. కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని రాజీవ్ గాంధీ పట్ల,దేశం పట్ల తనకున్న ప్రేమకు కొనసాగింపుగా ఆమె భావించారు. అలా 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచార ర్యాలీల్లో పాల్గొనడం ద్వారా సోనియా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు.

2019లో మరోసారి ఆయనే ముందుగా...

2019లో మరోసారి ఆయనే ముందుగా...

1998 నుంచి 2017 వరకూ దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేయడంతో సోనియానే అనివార్యంగా మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా సోనియా అంతగా ఆసక్తి కనబర్చనప్పటికీ... గులాం నబీ ఆజాద్ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. సోనియా నాయకత్వాన్ని బలపరిచిన 150 మంది నేతల్లో ఆయనే మొదటివాడు. ఇలా రెండు పర్యాయాలు సోనియాను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక కీలక పాత్ర పోషించిన ఆజాద్ ఇప్పుడు ఆమె నాయకత్వాన్నే ధిక్కరించడం ఆమెను ఒకింత ఎక్కువ బాధ పెట్టి ఉండవచ్చు.

సోనియా పెద్ద మనసు...

సోనియా పెద్ద మనసు...

సోనియా మాత్రం మరోసారి పెద్ద మనసు చేసుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటూ లేఖ రాసిన 23 మంది పట్ల గానీ,పార్టీలో ఇంకెవరి పట్ల గానీ తనకెలాంటి కోపం లేదన్నారు. పరిస్థితులు బాధించిన మాట నిజమే గానీ వారు తన సహచరులేనని... జరిగిందేదో జరిగిపోయిందని అన్నారు. ఇకముందు అంతా ఐక్యంగా కలిసి పనిచేద్దామని... పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. ఆజాద్ గురించి సోనియా ప్రత్యేకంగా ఎక్కడ ఏమీ ప్రస్తావించినప్పటికీ... ఆజాద్ పట్ల కూడా ఆమె పెద్ద మనసు చేసుకున్నట్లే...!!

English summary
Sonia Gandhi has a reason to be hurt by the involvement of Ghulam Nabi Azad among the ‘dissenters’, who wrote a letter seeking sweeping changes in the Congress’ leadership.Azad has been fiercely loyal to the Congress, and by extension, the Gandhis. His entry in politics dates back to Sanjay Gandhi era, and since then, there has been no looking back for him as he went on to become a union minister, a chief minister and an AICC functionary. In 24, Akbar Road main building, there would not be a single room that has not been occupied by Azad from 1980s till date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X