• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ అఖిలపక్షంపై ఎట్టకేలకు నోరు విప్పిన కాశ్మీరీ కీలక నేతలు..మీటింగ్ వన్‌సైడ్

|

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకున్న తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభత్వం చేస్తోన్న ప్రయత్నాలకు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కిందటి నెల 24వ తేదీన దేశ రాజధాని వేదికగా సాగిన అఖిలపక్ష సమావేశంపై కాశ్మీరీ నేతలు నోరు విప్పారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (PAGD) పేరుతో ఈ కూటమి ఏర్పాటైంది. తమ స్పందనను తెలియజేశారు. అఖిలపక్ష సమావేశ ఫలితాలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని స్పష్టం చేశారు.

వీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలంవీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలం

ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించన అఖిలపక్ష సమావేశానికి గుప్కర్ అలయన్స్ నేతలు హాజరైన విషయం తెలిసిందే. ఈ కూటమిలోని ఆరు పార్టీల నేతలు కూడా అఖిలపక్ష భేటీపై అసంతృప్తిిని వ్యక్తం చేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం, జమ్మూ కాశ్మీర్ ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకాశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తరఫున కూటమి నేత, సీపీఎంకు చెందిన ఎంవై తరిగామి ఓ ప్రకటన

Gupkar alliance expressed disappointment at outcome of PM Modis Delhi meet

తాము ప్రతిపాదించిన కొన్ని కీలకమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని వారు స్పష్టం చేశారు. రాజకీయ నేతలను విడుదల చేయాలంటూ తాము చేసిన సూచనలపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై చర్చించడానికి గుప్కర్ అలయెన్స్ నాయకులు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో భేటీ అయ్యారు. తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత 2019 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతలో చల్లార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు కనిపించలేదని పేర్కొన్నారు.

పరిస్థితులు కుదుటపడిన తరువాత జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దశాబ్దాల కాలం పాటు భరిస్తూ వచ్చిన వారెవరూ కూడా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కోరుకోరని పేర్కొన్నారు. ప్రజల అకాంక్షలకు విరుద్ధంగా- దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా బదలాయించినట్లు పేర్కొన్నారు. మెజారిటీ సంఖ్యలో ప్రజలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాజకీయ పార్టీల సూచనలను అఖిలపక్ష భేటీ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

English summary
Peoples Alliance for Gupkar Declaration of Jammu Kashmir expressed unhappy with all party meeting at Delhi chaired by PM Modi. Gupkar alliance released a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X