• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ ఆర్టికల్ 370: కాశ్మీర్‌లో కొత్త కూటమి - అబ్దుల్లా-ముఫ్తీ- కాంగ్రెస్ ఉమ్మడి పోరు - రోడ్ మ్యాప్

|

ఏడాది కిందట రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన జమ్మూకాశ్మీర్, లదాక్ లో మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. జమ్మూకాశ్మీన్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త కూటమి పురుడు పోసుకున్నది. ఈ మేరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ), పీడీపీ, కాంగ్రెస్‌ సహా మరో నాలుగు పార్టీలు చేతులు కలిపాయి.

జడ్జిలపై ఫిర్యాదు: జగన్‌కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడాజడ్జిలపై ఫిర్యాదు: జగన్‌కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడా

రహస్య సమావేశం..

రహస్య సమావేశం..

శ్రీనగర్ లోని ఓ రహస్య ప్రదేశంలో గురువారం సమావేశమైన ఏడు పార్టీలు.. కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తీర్మానం ఆమోదించాయి. జమ్మూకాశ్మీర్ లోఆర్టికల్ 370 ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్రానికి పంపిన నోట్‌పై ఆయా పార్టీల ప్రతినిధులు సంతకం చేశారు. సమావేశం అనంతరం ఆ ఏడు పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చారు. కూటమి వివరాలు, భవిష్యత్ కార్యాచరణను ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.

 గుప్కర్ డిక్లరేషన్..

గుప్కర్ డిక్లరేషన్..

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ఒక్కరోజు ముందు, అంటే, 2019, ఆగస్టు 4న.. శ్రీనగర్ సిటీ గుప్కర్ రోడ్డులోని ఎన్సీ నేత ఫరూక్ అబ్బుల్లా ఇంట్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించి ‘‘గుప్కర్‌ డిక్లరేషన్‌'' తీర్మానాన్ని ఆమోదించడం తెలిసిందే. మళ్లీ ఏడాది తర్వాత మొన్న ఆగస్టులో ఆ ఏడు పార్టీలు సమావేశమై గుప్కర్ డిక్లరేషన్ ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 14 నెలల గృహ నిర్బంధం తరువాత పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మంగళవారం(అక్టోబర్ 13న) విడుదల కావడంతో ఆర్టికల్ 370 పునరుద్దరణ పోరు ముమ్మరం అయింది. ముఫ్తీ విడుదలైన కొద్ది రోజలకే కొత్త కూటమి ఏర్పడటం గమనార్హం..

పేరు.. పీపుల్స్ అలయెన్స్..

పేరు.. పీపుల్స్ అలయెన్స్..

ఆర్టికల్ 370 పునరుద్ధరణే లక్ష్యంగా తీర్మానం చేసిన ‘గుప్కర్ డిక్లరేషన్'లో భాగంగా అన్ని పార్టీలు కలిసి రాజకీయ, సామాజిక పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. తమ కూటమికి ‘‘పీపుల్స్ అలయెన్స్ ఆఫ్ గుప్కర్ డిక్లరేషన్'' గా నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్రం కోల్పోయిన హక్కులు సాధించేందుకు రాజ్యాంగ పరమైన పోరాటం చేసేందుకు ఈ కూటమి ఏర్పడిందని, 2019 ఆగస్టు 5 కు ముందునాటి పరిస్థితులు తీసుకువచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

 కూటమిగానే ఎన్నికల్లో పోటీ..

కూటమిగానే ఎన్నికల్లో పోటీ..

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ని పునరుద్ధరించాలంటూ ‘పీపుల్స్ అలయెన్స్' పేరిట ఏకమైన వాటిలో.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌, సీపీఎం, జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ, పాంథర్స్‌ పార్టీ, జమ్ముకశ్మీర్‌ అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. కాగా, ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా పార్టీలననీ పీపుల్స్ అలయెన్స్ కూటమిగానే పోటీ చేస్తాయపి అబ్దుల్లా స్పష్టం చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబుజస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబు

English summary
The key political leaders of Jammu and Kashmir -- including National Conference patriarch Farooq Abdullah, his arch-rival Mehbooba Mufti of the People's Democratic Party and Sajjad Lone -- came together this evening to fight for the restoration of Article 370 and resolution of Kashmir. The freshly minted "People's Alliance for Gupkar Declaration" comes more than a year after the Centre ended the special status of Jammu and Kashmir granted under the constitution and bifurcated the state into two Union Territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X